మహిళా సాధికారితతోనే ప్రగతి

ABN , First Publish Date - 2021-03-09T06:59:28+05:30 IST

మహిళా సాధికారితతోనే ప్రగతి

మహిళా సాధికారితతోనే ప్రగతి

గన్నవరం, మార్చి 8: మహిళా సాధికారతతోనే సమాజం ఆర్ధిక ప్రగతి సాధిస్తుందని ఎంపీడీవో వై.సుభాషిణి, సర్పంచ్‌ దొప్పలపూడి జయలక్ష్మీ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని బీబీగూడెం పంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం తెలిపారు. మహిళలకు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. కార్యదర్శి రామెళ్ళ రాజేష్‌, మాజీ సర్పంచ్‌లు బోయపాటి బసవపూర్ణయ్య, మురళీకృష్ణ పాల్గొన్నారు. చిన్న ఆవుటపల్లి డాక్టర్‌ సి.శోభనాద్రి నర్సింగ్‌ కళాశాలలో కన్వీనర్‌ వీరపనేని శశికళను సన్మానించారు. ప్రిన్సిపల్‌ వందన పాల్గొన్నారు. గన్నవరం కోర్టులో న్యాయమూర్తులు ఎ.అనిత, స్పందన, గంగా భవాని, రామచంద్రరావు మాట్లాడారు. సీహెచ్‌సీలో పోలిమెట్ల జయరాజు డాక్టర్‌లకు పూలబొకేలు అందజేశారు. వీకేఆర్‌ కళాశాలలో మహిళా సిబ్బందిని ఘనంగా సన్మానించారు. ముస్తాబాదలో నవభారత్‌ హైస్కూల్‌లో ఉపాధ్యాయులను సన్మానించారు.  

ఫహనుమాన్‌జంక్షన్‌: బాపులపాడులో పలు విద్యాసంస్థలు, స్వచ్చంద సంస్థలు  మహిళలను  సత్కరించి  శుభాకాంక్షలు తెలిపారు. హనుమాన్‌జంక్షన్‌లో  సాయిగౌతమ్‌  హైస్కూల్‌లో విజయవాడ నెహ్రూ యువ కేంద్రం, స్కై యూత్‌ ఆర్గనైజేషన్‌, నవ భారత్‌  యూత్‌ రూరల్‌  డెవల్‌పమెంట్‌ అసోసియేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో బాపులపాడు గ్రామ సర్పంచ్‌ సరిపల్లి కమలాబాయి సత్కరించారు. బాపులపాడు ఎంజీ నగర్‌  ఎంపీపీ స్కూల్‌లో యూటీఎఫ్‌ మండల శాఖ టీచర్లను సత్కరించారు.  హనుమాన్‌జంక్షన్‌ జమాతే ఇస్లామి హింద్‌ మహిళా విభాగం ఆధ్యక్షులు అప్సర్‌ బేగం ఆధ్వర్యంలో  వివిధ వృత్తుల్లో  విశిష్టసేవలు అందిస్తున్న   మహిళలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆశాజ్యోతి దివ్యాంగుల పాఠశాల నిర్వాహకులు  మరీదు పాపాయమ్మ, వీరాస్వామిలను మానవత  సంస్థ సత్కరించింది. 

ఫఉంగుటూరు: లంకపల్లి ఎంపీపీ పాఠశాలలో గ్రామసర్పంచ్‌ కాకుల సుజాత అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీడీవో జ్యోతిని  హెచ్‌ఎం. సుధీర్‌కుమార్‌ నేతృత్వంలోని ఉపాధ్యాయ బృందం ఘనంగా సత్కరించింది. ఇందుపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎం, టి.సీతారామ్‌ ఆధ్వర్యంలో  విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. 

ఫవిజయవాడ రూరల్‌: రామవరప్పాడులో ఎంపీడీవో జె.సునీతను సర్పంచ్‌ వరిశ్రీదేవి ఆధ్వర్యంలో దుశ్శాలువతో ఘనంగా సన్మానించారు. నిడమానూరు సచివాలయ మహిళా ఉద్యోగులకు  పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. సర్పంచ్‌ శీలం రంగారావు పాల్గొన్నారు. 

ఫకంకిపాడు: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక మహిళా అభ్యర్థులను సోమవారం ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ముప్పా రాజా బాయిన నాగరాజు, మేదండ్రావు సతీష్‌, పిచుక క్రాంతి, కృష్ణమోహన్‌, పచ్చిపాల శేకర్‌ తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా ప్రజా పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మొవ్వల అన్వేష్‌ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం జరిగింది. 

ఫ ఉయ్యూరు: మహిళా సాధికారితతోనే సమాజ, దేశాభివృద్ధి సాధ్యమని ఉయ్యూరు జూనియర్‌ సివిల్‌ జిడ్జి, పదవ అదనపు మెట్రోపాలిటిన్‌ మెజిస్ట్రేట్‌  జేవీవీ సత్యనారాయణ అన్నారు. ఏజిఅండ్‌ఎ్‌సజిఎస్‌ డిగ్రీ కళాశాల ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌, ఐక్యుఏసీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. మహిళా సాధికారి త, హక్కులు, నిర్ణయాధికారం, ఆత్మరక్షణ, తదితర అంశాలపై విపులంగా తెలియచేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ డి.బాలకృష్ణ, జూనియర్‌ కళాశాల డెరెక్టర్‌ వినయ్‌కుమార్‌ పాల్గొన్నారు. కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం, ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ ఆధ్వర్యంలో తల్లిలేని విద్యార్ధినుల కు మధ్యాహ్నభోజనం, విద్యార్థినుల స్వీయరక్షణకు కరాటే శిక్షణా   ప్రారంభిస్తున్నట్టు సంఘం కన్వీనర్‌ ఎన్‌.వసంతరావు ప్రకటించారు. 

ఫఇన్నర్‌వీల్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవంలో పారిశుధ్య మహిళా కార్మికులను ఘనంగా సన్మానించారు. కొవిడ్‌-19 సమయంలో పారిశుధ్య కార్మికుల సేవలు ఎనలేనివని కేసీపీ సీవోవో, రోటరీ కౌన్సిలర్‌ జి.వెంకటేశ్వరరావు, క్లబ్‌ అధ్యక్ష కార్యదర్శులు చంద్రబాబు, అనీస్‌, ఇన్నర్‌వీల్‌క్లబ్‌ అధ్యక్షురాలు బీవీ మహాలక్ష్మి, జె.శ్యామలాదేవి కొని యాడారు. పారిశుధ్యకార్మికులు నిర్మలాభవాని, ఝాన్సీలక్ష్మి, నాగదుర్గ, వి.సుజాత, ఆర్‌.లక్ష్మిలను ఘనంగా సన్మానించారు. 

ఫపెనమలూరు : జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలలో వేడుకలను నిర్వహించి  మహిళలను సత్కరించారు. వీఆర్‌ సిద్ధార్థ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో గ్రంథాలయ సంఘం కార్యదర్శి రావి శారదను ప్రిన్సిపాల్‌ ఏవి. రత్న ప్రసాద్‌ సత్కరించారు. తాడిడప మున్సిప ల్‌ కార్యాలయంలో జరిగిన వేడుకలలో కమిషన్‌ వెంకట లక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - 2021-03-09T06:59:28+05:30 IST