మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సునీతాలక్ష్మారెడ్డితో స్పెషల్ లైవ్

ABN , First Publish Date - 2022-01-09T22:51:51+05:30 IST

మహిళల్లో మనో ధైర్యం నింపుతూ వారి సమస్యల పరిష్కారానికి సలహాలు-సూచనలు అందించేందుకు తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి టి-సాట్ వేదికను ఎంచుకున్నారు.

మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సునీతాలక్ష్మారెడ్డితో స్పెషల్ లైవ్

హైదరాబాద్: మహిళల్లో మనో ధైర్యం నింపుతూ వారి సమస్యల పరిష్కారానికి సలహాలు-సూచనలు అందించేందుకు తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి టి-సాట్ వేదికను ఎంచుకున్నారు. మహిళలు నిత్యం ఎదుర్కొనే సమస్యలు, వివిధ సందర్భాల్లో మహిళలు ఎదుర్కొంటున్న  వేధింపులు, అవమానాలు తదితర సమస్యలతో పాటు మహిళలు స్వయం శక్తని కూడగట్టుకుని ముందుకు సాగే ప్రక్రియకు చేయూతనిచ్చేందుకు మహిళా కమిషన్ తరుపున టి-సాట్ స్టూడియోకు హాజరౌతారు. ఈ మేరకు టి-సాట్ సీఈవో రాంపురం శైలేష్ రెడ్డి ఆదివారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 10వ తేదీ సోమవారం ఉదయం 11 నుండి ఒంటి గంట వరకు టి-సాట్ స్టూడియోలో కమిషన్ ఛైర్ పర్సన్ వాకిటి సునీతాలక్ష్మారెడ్డి అందుబాటులో ఉంటారని తెలిపారు. 


టి-సాట్ నిపుణ ఛానల్ అందించే ప్రత్యేక ప్రత్యక్ష్య ప్రసార కార్యక్రమంలో మహిళలు ఫోన్ ద్వార 040-23540326, 23540726  టోల్ ఫ్రీ నెంబర్ 1800  425 4039 లకు నేరుగా ఫోన్ చేసి ఛైర్ పర్సన్ సునీతాలక్ష్మారెడ్డితో మాట్లాడవచ్చని సూచించారు. చైర్ పర్సన్ తో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ పాల్గొంటారని, రెండు గంటల పాటు జరిగే ప్రత్యేక లైవ్ కార్యక్రమం టి-సాట్ నిపుణ ఛానల్ తో పాటు యూట్యూబ్ లోనూ (tastnetwork/youtube) లైవ్ ప్రసారాలుంటాయని శైలేష్ రెడ్డి తెలిపారు. ఈ అవకాశాన్ని తెలంగాణ మహిళా లోకం వినియోగించుకోవాలని సూచించారు.

Updated Date - 2022-01-09T22:51:51+05:30 IST