వైసీపీ నేత వేధింపులపై సీఎం జగన్‌కు మహిళా వాలెంటీర్ సెల్ఫీ వీడియో

ABN , First Publish Date - 2021-10-08T22:11:57+05:30 IST

వైసీపీ నేత వేధింపులపై సీఎం జగన్‌కు మహిళా వాలెంటీర్ సెల్ఫీ వీడియో

వైసీపీ నేత వేధింపులపై సీఎం జగన్‌కు మహిళా వాలెంటీర్ సెల్ఫీ వీడియో

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మహిళా వాలెంటీర్ సెల్ఫీ వీడియోలో తన ఆవేదనను వ్యక్తం చేశారు. వైసీపీ నేత వేధింపులను సీఎం జగన్‌కు మహిళా వాలెంటీర్ సెల్ఫీ వీడియో ద్వారా తెలిపారు. నాదెండ్ల ఎంపీటీసీ గుడికందుల యల్లారావు వేధింపుల నుంచి తనను కాపాడలని మహిళా వాలెంటీర్ వేడుకున్నారు. దళిత కుటుంబానికి చెందిన తాను వాలెంటీర్‌గా పనిచేస్తూ డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నానని చెప్పారు. తన ప్రియురాలు కుమార్తెను వాలెంటీర్‌గా పెట్టాలని తనను ఎంపీటీసీ వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఎంపీటీసీ నుంచి తనను కాపాడాలని వాలెంటీర్ చెవుల యామిని సెల్ఫీ వీడియాలో కోరారు.

Updated Date - 2021-10-08T22:11:57+05:30 IST