TS News: అంతర్జాతీయ మహిళల అక్రమ రవాణా ముఠా అరెస్టు

ABN , First Publish Date - 2022-07-22T17:17:06+05:30 IST

హైదరాబాద్‌లో మరోసారి అంతర్జాతీయ మహిళల అక్రమ రవాణా ముఠా వెలుగు చూసింది.

TS News: అంతర్జాతీయ మహిళల అక్రమ రవాణా ముఠా అరెస్టు

హైదరాబాదు (Hyderabad): నగరంలో మరోసారి అంతర్జాతీయ మహిళల అక్రమ రవాణా ముఠా వెలుగు చూసింది. ఉపాధి పేరుతో మహిళలను హైదరాబాద్‌కు  తీసుకువచ్చిన ముఠా.. వాళ్లతో వ్యభిచారం (adultery) చేయిస్తోంది. బంగ్లాదేశ్‌ (Bangladesh)కు చెందిన ఇద్దరు అమ్మాయిలను రాచకొండ పోలీసులు రిస్క్యూ (recuse) చేశారు. ఉప్పల్ పోలీసులతో కలిసి యాంటీ హ్యూమన్ ట్రాఫిక్ యూనిట్ స్పెషల్ ఆపరేషన్ (Special Operation) చేపట్టారు. ఏడుగురు నిర్వాహకులను అరెస్టు చేశారు.  నిందితులు బంగ్లాదేశ్, జార్ఖండ్, రాజస్థాన్, మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందినవారు. ముఠా చేతిలో చిక్కుకున్న ఇద్దరు విదేశీ యువతులను పోలీసులు రక్షించారు. బాధితుల్లో 15 సంవత్సరాల బాలిక ఉంది.

Updated Date - 2022-07-22T17:17:06+05:30 IST