UAE లోని మహిళలందరికీ బంపరాఫర్.. ఆగష్టు 28 నుంచి 31 వరకు ఉచితంగా..

ABN , First Publish Date - 2021-08-27T21:12:19+05:30 IST

ఎమిరటీ ఉమెన్స్ డే సందర్భంగా యూఏఈలోని మహిళలందరికీ షార్జాలోని రఫీద్ ఆటోమోటివ్ సొల్యూషన్స్ అనే కారు సర్వీసింగ్ సెంటర్ బంపర్ ఆఫర్ ప్రకటించింది.

UAE లోని మహిళలందరికీ బంపరాఫర్.. ఆగష్టు 28 నుంచి 31 వరకు ఉచితంగా..

షార్జా: ఎమిరటీ ఉమెన్స్ డే సందర్భంగా యూఏఈలోని మహిళలందరికీ షార్జాలోని రఫీద్ ఆటోమోటివ్ సొల్యూషన్స్ అనే కారు సర్వీసింగ్ సెంటర్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆగస్టు 28 నుంచి 31 వరకు మహిళలందరికీ ఉచితంగా వాహనాల వాషింగ్, చెకింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఎమిరటీతో పాటు ప్రవాస మహిళలకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని రఫీద్ సెంటర్ ప్రకటించింది. షార్జా రింగ్ రోడ్‌లోని అల్ అజ్రాలో ఉన్న రఫీద్ ఆటోమోటివ్ సొల్యూషన్ కేంద్రంలో మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని నిర్వహకులు తెలిపారు. దీనికోసం ఎలాంటి ముందస్తు అపాయింట్‌మెంట్లు ఉండవని చెప్పారు. 


ఆగస్టు 28న ఎమిరటీ ఉమెన్స్ డే సందర్భంగా మహిళలందరికీ ఈ ఆఫర్ ఇస్తున్నట్లు రఫీద్ సెంటర్ స్పష్టం చేసింది. ఈ సందర్భంగా రఫీద్ ఆటోమోటివ్ సొల్యూషన్ సీఈఓ సలీం సాయీద్ అల్ మిద్ఫా మట్లాడుతూ.. 'ఎమిరేట్స్ ఉమెన్' ప్రారంభించడం యూఏఈలోని మహిళలందరికీ మా ప్రశంసలకు చిహ్నంగా పనిచేస్తుందని అన్నారు. వారి స్వదేశం, కుటుంబాల పట్ల వారి ప్రయత్నాలు, పట్టుదల, నిబద్ధత మొత్తం సమాజానికి గర్వకారణం అని ఆయన పేర్కొన్నారు.    

Updated Date - 2021-08-27T21:12:19+05:30 IST