Abn logo
May 30 2020 @ 16:42PM

చిత్తూరు జిల్లా మదనపల్లిలో విషాదం

Kaakateeya

  • 200 అడుగుల ఎత్తైన కొండపై..
  • నుంచి దూకి వివాహిత ఆత్మహత్య

చిత్తూరు : జిల్లాలోని మదనపల్లె మండలం వేంపల్లి గ్రామం గుట్టకిందపల్లెలో ఘోరం జరిగింది. కుటుంబ కలహాలతో ఓ వివాహిత 200 అడుగుల ఎత్తైన కొండ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆ వివాహితను సుజనగా గుర్తించారు. ఆమెకు నాలుగేళ్ల క్రితం సమీప బంధువు అయిన విశ్వనాధ్‌తో వివాహమైంది. ఆయన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తుండే వాడు. కొన్ని రోజుల పాటు అంతా సాఫీగానే జరిగిన వీరి సంసారంలో సఖ్యత లోపించింది. లాక్‌డౌన్ కారణంగా అత్తగారి ఇంటికి (మదనపల్లె) వచ్చారు. రెండు నెలలుగా విశ్వనాధ్, సుజన అత్తగారింటిలోనే వున్నారు.

 

ఈ నేపథ్యంలో శనివారం నాడు మల్లయ్యకొండ మీద ఉన్న శివాలయాన్ని దర్శించుకోవడానికి సుజన, విశ్వనాధ్ కుటుంబం వెళ్లారు. అందరూ ఆలయంలో ఉండగా సుజన బయటకు వచ్చి 200 అడుగుల ఎత్తైన శిఖరం మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. సుజన మృతిపై ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న మదనపల్లి తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement
Advertisement