ఆత్మహత్యే శరణ్యం

ABN , First Publish Date - 2021-09-29T05:27:06+05:30 IST

తన భూమి ని ఇతరుల పేర్ల మీద మార్చారనీ, తనకు న్యా యం చేయకుంటే ఆత్మహత్యే శరణ్యమని మండలంలోని పీ కొత్తపల్లికి చెందిన మహిళా రైతు నారాయణమ్మ ఆవేదన చెందింది.

ఆత్మహత్యే శరణ్యం

మహిళా రైతు... తహసీల్దార్‌ కార్యాలయానికి తాళం వేసి, పెట్రోల్‌ బాటిల్‌తో బైఠాయింపు

నల్లచెరువు, సెప్టెంబరు 28: తన భూమి ని ఇతరుల పేర్ల మీద మార్చారనీ, తనకు న్యా యం చేయకుంటే ఆత్మహత్యే శరణ్యమని మండలంలోని పీ కొత్తపల్లికి చెందిన మహిళా రైతు నారాయణమ్మ ఆవేదన చెందింది. తన సమస్యపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ మంగళవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయానికి తాళం వేసి, పెట్రోల్‌ బా టిల్‌తో అక్కడే బైఠాయించింది. పీ కొత్తపల్లి ప రిధిలో మహిళా రైతు నారాయణమ్మకు సర్వే నెంబర్‌ 446-3లో 40 సెంట్లు, సర్వే నెంబర్‌ 494-2సీలో 1.90 ఎకరాలు, సర్వే నెంబర్‌ 446- 6డీలో ఎకరా, సర్వే నెంబర్‌లో 446- 5సీలో 30 సెంట్లు, సర్వే నెంబర్‌ 446-2బీలో 60 సెంట్లు, సర్వే నెంబర్‌ 442-3లో 67 సెంట్లు మొత్తం 3.70 ఎకరాలు ఉంది. గతంలో తీసీన 1బీలో ఆ మె పేరున 3.70 ఎకరాలు ఉన్నట్లు చూపింది. ఆ తరువాత తీసీన 1బీలో భూమి ఎస్‌. నరసమ్మ, ఎరికిలప్ప, రామకృష్ణారెడ్డి పేర్ల మీద ఉన్నట్లు చూపింది. దీంతో బాధితురాలు.. త హసీల్దార్‌ కార్యాలయానికి పలుమార్లు వ చ్చింది. తన భూమిని మరొకరి పేరుతో 1బీ లో ఎక్కించారనీ, తన పేరుకు మార్చాలని వి న్నవించుకుంది. అయినా.. అధికారులు పట్టించుకోలేదు. ‘నీవు బతికున్నంత వరకే ఆ భూ మిపై హక్కులు నీకు ఉంటాయనీ, ఆ తరువాత నీది కాద’ని తహసీల్దార్‌ జిలానీ తేల్చిచెప్పినట్లు మహిళా రైతు పేర్కొంది. దీంతో త హసీల్దార్‌ వైఖరిని నిరసిస్తూ మంగళవారం ఉదయం తన ఇద్దరు కుమార్తెలతో కలిసి మ హిళా రైతు పెట్రోల్‌ బాటిల్‌తో తహసీల్దార్‌ కా ర్యాలయం వద్దకు చేరుకుంది. కార్యాలయానికి తాళం వేసి, అక్కడే బైఠాయించింది. దీంతో సిబ్బంది బయటే ఉండిపోవాల్సి వచ్చింది. స మాచారం తెలుసుకున్న ఎస్‌ఐ మునీర్‌ అ హమ్మద్‌.. సిబ్బందితో అక్కడికి చేరుకుని, మ హిళా రైతు వద్దనున్న పెట్రోల్‌ బాటిల్‌ను లా క్కున్నారు. వారిని బలవంతంగా పోలీసుస్టేషనకు తరలించారు. ఈక్రమంలో జీపులో నుం చి దూకడానికి వారు ప్రయత్నించారు. పోలీసులు నిలువరించారు. తహసీల్దార్‌ సెలవులో ఉన్నారనీ, ఆమె వచ్చాక సమస్య పరిష్కరించుకోవచ్చని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మ హిళా రైతు ససేమిరా అనడంతో డిప్యూటీ త హసీల్దార్‌ మధు సమక్షంలో స్టేషనలో సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. రైతు ఒప్పుకోకపోవడంతో ఆర్డీఓ, జాయింట్‌ కలెక్టర్‌తో ఫోనలో మాట్లాడించి, సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇప్పించడంతో వారు శాం తించారు. భూ సమస్యల పరిష్కారంలో తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బంది చూపుతున్న నిర్లక్ష్య వైఖరిపై మండల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రెవెన్యూ ఉన్నతాధికారులు చొరవ తీసుకుని, తహసీల్దార్‌ కార్యాలయంలో సిబ్బంది.. తమ సమస్యలు సత్వరం పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. తహసీల్దార్‌ నిర్లక్ష్య ధోరణితో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామనీ, వెంటనే ఆమెను బదిలీ చేయాలని కోరుతున్నారు.


Updated Date - 2021-09-29T05:27:06+05:30 IST