మహిళలు ఆర్థికంగా ఎదగాలి

ABN , First Publish Date - 2022-08-19T04:14:18+05:30 IST

మహిళలు ఆర్థికంగా ఎదగా లని ఠ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని రైతువేదికలో చేతన్‌ ఫౌండేషన్‌ ఆద్వర్యంలో 35మంది మహిళలకు కుట్టుమిషన్‌లు పంపిణీచేశారు. ఈసంద ర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడు వారికుటుంబం ఆర్థికంగా బాగుపడు తుందన్నారు.

మహిళలు ఆర్థికంగా ఎదగాలి
విద్యార్థులను సన్మానిస్తున్న ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

కౌటాల, ఆగస్టు 18: మహిళలు ఆర్థికంగా ఎదగా లని ఠ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని రైతువేదికలో చేతన్‌ ఫౌండేషన్‌ ఆద్వర్యంలో 35మంది మహిళలకు కుట్టుమిషన్‌లు పంపిణీచేశారు. ఈసంద ర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడు వారికుటుంబం ఆర్థికంగా బాగుపడు తుందన్నారు. చేతన్‌ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఎన్నోసేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఫౌండేషన్‌ చైర్మన్‌ వెనిగళ్ల రవి, రేణుకా, ఎమ్మెల్యే సతీమణి రమాదేవి పాల్గొన్నారు. 

కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ

మండలంలోని ఆయాగ్రామాలకు చెందిన ఎనిమిది మంది లబ్ధిదారులకు గురువారం ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. మండలానికి మొదటివిడతగా 48మందికి ఆసరా పెన్షన్ల స్మార్ట్‌ కార్డులను లబ్ధిదారులకు అందించారు. 

అభ్యర్థులకు సన్మానం

టెట్‌లో రాష్ట్రస్థాయిలో 5వర్యాంకు సాధించిన విద్యా ర్థిని మనీషతోపాటు స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో వ్యాస రచన పోటీల్లో రాష్ట్రంలోనే మొదటిస్థానం గెలుచుకుని గవర్నర్‌ చేతుల మీదుగా అవార్డు అందుకున్న పార్డి గ్రామానికి చెందిన బికారు లను గురువారం ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సన్మానించా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నతంగా చదివి ఉద్యోగం సాధించాలని, ఎలాంటి అవసరం ఉన్నా తననుసంప్రదించాలన్నారు. డీఆర్డీవో సురేందర్‌, అద నపు డీఆర్డీవోశ్రీనివాస్‌, ఎంపీపీవిశ్వనాథ్‌, నానయ్య, ఆర్‌ఎస్‌ఎస్‌ అధ్యక్షుడు బ్రహ్మయ్య పాల్గొన్నారు.

Updated Date - 2022-08-19T04:14:18+05:30 IST