మహిళల పట్ల గౌరవప్రదంగా వ్యవహరించాలి

ABN , First Publish Date - 2022-05-28T05:15:01+05:30 IST

ఆటో డ్రైవర్లు రోడ్డు మీద వెళుతున్న మహిళలు, కళాశాలల విద్యా ర్థినుల పట్ల గౌరవప్రదంగా వ్యవహరిం చాలని వాల్మీకిపురం సీఐ నాగార్జున రెడ్డి సూచించారు.

మహిళల పట్ల గౌరవప్రదంగా వ్యవహరించాలి
ఆటో డ్రైవర్లకు కౌన్సెలింగ్‌ ఇస్తున్న సీఐ

కలికిరి, మే 27: ఆటో డ్రైవర్లు రోడ్డు మీద వెళుతున్న మహిళలు, కళాశాలల విద్యా ర్థినుల పట్ల గౌరవప్రదంగా వ్యవహరిం చాలని వాల్మీకిపురం సీఐ నాగార్జున రెడ్డి సూచించారు. మహిళల నుంచి ఫిర్యాదు లు వస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. శుక్రవారం కలికిరి ఎస్‌ఐ లోకేష్‌ రెడ్డితో కలిసి ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనపడితే పోలీసులకు సమా చారం ఇవ్వాలని, వారి పేర్లు మాత్రం వెల్లడించమని వివరించారు. డ్రైవింగ్‌ లైసెన్సు, ఇన్సూరెన్సు, ఇతర పత్రాలను సిద్ధంగా వుంచుకోవాలన్నారు. కార్యక్రమంలో  పోలీసు సిబ్బంది, పట్టణానికి చెందిన డ్రైవర్లు హాజరయ్యారు. 


Updated Date - 2022-05-28T05:15:01+05:30 IST