మహిళలకు చట్టాలపై అవగాహన కల్పించాలి

ABN , First Publish Date - 2021-04-16T05:49:15+05:30 IST

పని చేసే ప్రదేశాల్లో మహిళలకు రక్షణ కల్పించే చట్టాలపై అవగాహన కల్పించాలని జిల్లా స్ర్తీ, శిశు అభివృద్ధి సంస్థ పథక సంచాలకులు కె.అనంతలక్ష్మి కోరారు.

మహిళలకు చట్టాలపై అవగాహన కల్పించాలి
సమావేశంలో పాల్గొన్న అనంతలక్ష్మి

విశాఖపట్నం, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి) : పని చేసే ప్రదేశాల్లో మహిళలకు రక్షణ కల్పించే చట్టాలపై అవగాహన కల్పించాలని జిల్లా స్ర్తీ, శిశు అభివృద్ధి సంస్థ పథక సంచాలకులు కె.అనంతలక్ష్మి కోరారు. జిల్లా కలెక్టర్‌ సమావేశ మందిరంలో ‘పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు ’ అనే అంశంపై గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా స్థాయి నుంచి కింది స్థాయి వరకు అన్ని కార్యాలయాల్లో ఇంటర్నల్‌ కంప్లైంట్స్‌ కమిటీ ఏర్పాటు చేయాలని, జిల్లా స్థాయిలో కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఏర్పాటు చేస్తామన్నారు. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు గురయ్యే ఉద్యోగినులు నిరభ్యంతరంగా ఫిర్యాదు చేయాలని ఆమె కోరారు. దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ సెంటర్‌ ఫర్‌ వుమెన్‌ స్టడీస్‌(ఏయూ) డైరెక్టర్‌ పి.ఉష మాట్లాడుతూ పని ప్రదేశాల్లో లోకల్‌ కంప్లైంట్స్‌ కమిటీ ఏర్పాటు వల్ల ఉద్యోగినులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా డీఆర్‌వో చేతుల మీదుగా పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు ఆపాలి, మహిళ హక్కులకు గౌరవాన్ని ఇవ్వాలి అనే అంశాలతో కూడిన పోస్టర్లను ఆవిష్కరించారు. 


Updated Date - 2021-04-16T05:49:15+05:30 IST