సెలెక్షన్‌ కమిటీయే లేదు..‘చాలెంజర్‌’ జట్ల ఎంపిక ఎలా ?

ABN , First Publish Date - 2020-08-07T09:41:49+05:30 IST

ఐపీఎల్‌ ప్లే ఆఫ్‌ జరిగే రోజుల్లోనే మహిళల టీ20 చాలెంజర్‌ టోర్నీ నిర్వహించనున్నారు. ఈ ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లలో ...

సెలెక్షన్‌ కమిటీయే లేదు..‘చాలెంజర్‌’ జట్ల ఎంపిక ఎలా ?

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ ప్లే ఆఫ్‌ జరిగే రోజుల్లోనే మహిళల టీ20 చాలెంజర్‌ టోర్నీ నిర్వహించనున్నారు. ఈ ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లలో మూడు మహిళల జట్లు పాల్గొనాల్సి ఉంది. కానీ ఈ జట్లను ఎంపిక చేసేందుకు..మహిళల సెలెక్షన్‌ కమిటీయే లేదు. ఐదుగురు సభ్యుల గత కమిటీ పదవీకాలం జనవరిలో ముగిసింది. వారి స్థానాల భర్తీకి బీసీసీఐ నోటిఫికేషన్‌ జారీ చేసినా..కమిటీ ఎంపిక మాత్రం జరగలేదు. కరోనా కారణంగా బోర్డు ఇంటర్వ్యూలు నిర్వహించలేకపోయిందని చెబుతున్నారు. మరి చాలెంజర్‌ సిరీ్‌సకు జట్లను ఎలా ఎంపిక చేస్తారన్నది వేచి చూడాలి. ఇక..నవంబరులో చాలెంజర్‌ సిరీస్‌ జరగనుండడంతో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, స్మృతిమంధాన, వేద కృష్ణమూర్తికి మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌లో ఆడేందుకు బోర్డు ‘నిరభ్యంతర పత్రాలు’ జారీ చేసే అవకాశం లేదు. 


Updated Date - 2020-08-07T09:41:49+05:30 IST