మహిళలే.. మహారాణులు

ABN , First Publish Date - 2021-03-08T05:21:35+05:30 IST

మహిళలే మహారాణులు అని పాలకొండ డీఎస్పీ శ్రావణి అన్నారు.

మహిళలే.. మహారాణులు
డీఎస్పీ శ్రావణిని సత్కరిస్తున్న దృశ్యం

రాజాం రూరల్‌: మహిళలే మహారాణులు అని పాలకొండ డీఎస్పీ శ్రావణి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం రాత్రి రాజాంలోని కల్యాణమండపంలో ఏర్పాటు చేసిన పాలకొండ డివిజన్‌స్థాయి మహిళా సదస్సులో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు ఎందులోనూ తక్కువ కాదు.. అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా దూసుకెళ్తున్నారన్నారు.  కొన్ని సందర్భాలలో ఇబ్బందులకు గురవుతున్నారు.. ఆ ఇబ్బందులను అధిగమించాలంటే మహిళలు చదువుకుని సమాజంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.  దిశ చట్టంతో పాటు మహిళలకు రక్షణ కల్పించే పలు చట్టాల గురించి ఆమె కూలంకషంగా వివరించారు. ఈ సందర్భంగా పలువురు మహిళా ఎస్‌ఐలు, ఉద్యోగులను ఆమె సన్మానించారు. అనంతరం కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్నారు.  కార్యక్ర మంలో రాజాం టౌన్‌, రూరల్‌ సి.ఐ.లు శ్రీనివాసరావు, నవీన్‌కుమార్‌... ఎస్‌ఐ.లు రేవతి, మహమ్మద్‌ ఆజాద్‌, రామారావు, ట్రైనీ ఎస్‌ఐ. దివ్యజ్యోతి ఉన్నారు. 

ఆర్ధిక స్వాలంబనతోనే మహిళాసాధికారిత

పాతపట్నం: ఆర్థిక స్వాలంబనతోనే మహిళాసాధికారిత సాధ్యమని ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక సామాజిక ఆసుపత్రి కూడలిలోని వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి మహిళ లతో కొవ్వొత్తుల ర్యాలీను ఆదివారం సాయంత్రం నిర్వహించారు. కార్య క్రమంలో లింగాల ఉషారాణి, సవి రిగాన ప్రదీప్‌, ఎస్‌ జోగారావు, ఏనుగుతల సూర్యం, కొండాల యరకయ్య పాల్గొన్నారు.

Updated Date - 2021-03-08T05:21:35+05:30 IST