Abn logo
Sep 21 2021 @ 01:21AM

అతివలదే విజయం

జిల్లాపరిషత్‌ ఎన్నికల విజేతల్లో గృహిణులే అధికం 

999 మంది ఎంపీటీసీల్లో 412 మంది వాళ్లే

ఆ తర్వాత రైతులు, వ్యాపారులు అధికం 

 61 మంది జడ్పీటీసీల్లో గృహిణులు 32 మంది

రైతులు 11 మంది..  రిటైర్డ్‌ ఉద్యోగులు ఇద్దరే 

 బరిలోకి దిగి గెలిచిన వారిలో ఉన్నత విద్యావంతులు తక్కువే

ఎంపీటీసీల్లో డిగ్రీ, పీజీ అర్హత ఉన్నవాళ్లు 50 మందిలోపే 

పదిలోపు విద్యార్హత ఉన్న ఎంపీటీసీలు 315 మంది

నిరక్షరాస్యులు 120 మంది.. మిగిలినవారంతా ఇంటర్‌లోపే

జడ్పీటీసీల్లో డిగ్రీ చదివినవాళ్లు 21, ఇంటర్‌ 13 మంది 

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ఎన్నికల విజేతల్లో అన్ని పార్టీల నుంచి ఈ దఫా మహిళలు సత్తా చాటారు. అధిక స్థానాల్లో విజయం సాధించి పాలన పగ్గాలు చేపట్టబోతు న్నారు. వీరిలో చాలామంది నిన్నమొన్నటి వరకు సాధారణ గృహిణులు కాగా ఇప్పుడు జిల్లా పరిషత్‌ పాలనలో తమ దైన ముద్ర వేయబోతున్నారు. ముఖ్యంగా ఎంపీటీసీల విషయానికి వస్తే జిల్లాలో 999 స్థానాలకు ఎన్నికలు జరగ్గా ఇందులో 412 మంది విజేతలు గృహిణులే కావడం విశేషం. వీరిలో అత్యధిక శాతం మందికి వివిధ పార్టీల నుంచి బరిలో దిగారు. అయితే ఆయా ప్రాంతాల్లో రిజర్వేషన్లు పరంగా కొందరు పోటీలో నిల్చోవాల్సి రాగా, మరికొందరు రాజకీయ ఆరంగ్రేటం ఈ ఎన్నికలతో మొదలుపెట్టారు. గృహిణులు తర్వాత అత్యధిక ఎంపీటీసీ విజేతల్లో రైతులు, వ్యాపారులు ఉన్నారు. అటు ఎంపీటీసీల విద్యార్హతలు పరిశీ లిస్తే డిగ్రీ, పీజీ చదివిన వాళ్లు కేవలం 50 మందిలోపే ఉన్నారు. పదిలోపు అర్హత అంటే రెండో తరగతి, నాలుగో తరగతి, అయిదు, ఆరు చదివిన వాళ్లు 315 మంది ఉన్నట్టు తేలింది. అసలేమీ చదువుకోని నిరక్షరాస్యులైన ఎంపీటీసీలు 120 మందిగా నామినేషన్ల లెక్కల ప్రకారం గుర్తించారు. మిగిలిన వారంతా ఇంటర్‌లోపే ఉన్నారు. అలాగే జడ్పీటీసీల విషయానికి వస్తే 61స్థానాలకు ఎన్నికలు జరగ్గా ఇందులో జడ్పీటీసీలుగా గెలిచిన మహిళల్లో 32 మంది గృహిణులే కావడం విశేషం. ఆతర్వాత 11 మంది రైతులు, ఇద్దరు రిటైర్డ్‌ ఉద్యోగులు ఉన్నారు. విద్యార్హతల విషయానికి వస్తే జడ్పీ టీసీల్లో ఇంటర్‌ చదివినవారు 13, డిగ్రీ 21, పదిలోపు చదు వుకున్నవాళ్లు అయిదుగురు, ఐటీఐ 1, బీటెక్‌ 1, ఫార్మసీ చది విన వారు ఒకరున్నారు. కాగా శంఖవరం మండలం వైసీపీ జడ్పీటీసీగా విజయం సాధించిన మల్లేశ్వరి (28). జడ్పీటీసీ లందరిలో ఈమె తక్కువ వయస్సున్న ప్రజాప్రతినిధి.