Ugly fight: లోకల్ ట్రైన్‌లో జుట్టు పట్టుకొని కొట్టుకున్న మహిళలు...వీడియో వైరల్

ABN , First Publish Date - 2022-10-07T16:49:49+05:30 IST

ముంబై లోకల్ రైలులో సీటు విషయంలో జరిగిన వివాదం కొంతమంది మహిళల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణకు దారి తీసింది...

Ugly fight: లోకల్ ట్రైన్‌లో జుట్టు పట్టుకొని కొట్టుకున్న మహిళలు...వీడియో వైరల్

ముంబయి:ముంబై లోకల్ రైలులో సీటు విషయంలో జరిగిన వివాదం కొంతమంది మహిళల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణకు దారి తీసింది.థానే-పన్వేల్ మధ్య లోకల్ రైలులో(Mumbai local train) సీటు విషయంలో మహిళల మధ్య తీవ్ర ఘర్షణ(Ugly fight)జరిగింది.(Women passengers hit)ఒక వీడియోలో (video)థానే-పన్వేల్ లోకల్ ట్రైన్‌లోని లేడీస్ కంపార్ట్‌మెంట్‌లో మహిళలు ఒకరి జుట్టు ఒకరు పట్టుకొని కొట్టుకోవడం కనిపించింది.(pull hair over seat)ఇంతలో శారదా ఉగ్లే అనే మహిళా కానిస్టేబుల్ ఇద్దరు మహిళా ప్రయాణికుల మధ్య గొడవను ఆపడానికి ప్రయత్నించింది. అయితే మహిళా కానిస్టేబుల్ గాయపడి ఆసుపత్రిలో చేరింది. 


లోకల్ రైలులో మహిళలు జుట్టుపట్టుకొని కొట్టుకోవడంతోపాటు ఆపబోయిన మహిళా కానిస్టేబుల్ ను వారు గాయపర్చారని వాషి రైల్వే స్టేషన్ సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఎస్ కటారే చెప్పారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.( viral on social media) 




Updated Date - 2022-10-07T16:49:49+05:30 IST