మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలి

ABN , First Publish Date - 2021-03-09T06:02:32+05:30 IST

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని నాయకు లు అన్నారు.

మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలి
మహిళా ఉద్యోగులను సన్మానిస్తున్న ఎక్సైజ్‌ శాఖ అధికారులు

ఖానాపూర్‌, మార్చి 8 : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని నాయకు లు అన్నారు. మండల కేంద్రంతో పాటు పలుచోట్ల సోమవారం అంతర్జాతీ య మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా  మున్సిపల్‌ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న మహిళా సిబ్బందిని చైర్మన్‌ రాజేందర్‌ సన్మానించారు. కార్యక్రమాల్లో డీఐఈవో పరశురాం, మున్సిపల్‌ కమిషనర్‌ తోట గంగాధర్‌, వైస్‌ చైర్మన్‌ అబ్దుల్‌ ఖలీల్‌, తదితరులు పాల్గొన్నారు. 

నిర్మల్‌ కల్చరల్‌: పెన్షనర్ల సంఘ భవనంలో సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సమావేశం ఏర్పాటు చేశారు. మహిళల హక్కుల సాధన కోసం ఐద్వా పోరాటం చేస్తుందని జిల్లా కార్యదర్శి బి. సు జాత అన్నారు. గంగమణి, శ్యామల, ఇంద్రమాల, లక్ష్మి పాల్గొన్నారు. వశిష్ట డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు.  స్థానిక దేవిబాయి ఆసుపత్రిలో ఉచిత సంతాన సాఫల్య చికిత్స శిబిరాన్ని నిర్వ హించారు. 

కుభీర్‌: కుభీర్‌లోని జడ్పీ ఉన్నత పాఠశాలలో సర్పంచ్‌ మీరా విజయ్‌, ఎంపీటీసీ పోసాని, మధ్యాహ్న భోజనం కార్మికురాలు అనితను సన్మానించా రు. కార్యక్రమంలో హెచ్‌ఎం సాయన్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

కుంటాల: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని సర్పంచ్‌ సమత, హై స్కూల్‌ హెచ్‌ఎం గజపెల్లి నర్సయ్య అన్నారు. స్థానిక హైస్కూల్‌లో కార్యక్ర మం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు రావుల గంగన్న, స మత కమిటీ కన్వీనర్‌ గాయత్రి పాల్గొన్నారు.

పెంబి: మండల కేంద్రంలోని పోస్టాఫీస్‌ కార్యాలయంలో వివిధ రంగాల లో రాణిస్తున్న మహిళలను సన్మానించారు. పోస్టల్‌ సూపరింటెండెంట్‌ శ్రీ కేబీఆర్‌ ప్రసాద్‌, నిర్మల్‌ సబ్‌ డివిజన్‌ పోస్టల్‌ ఇన్‌స్ప్టెర్‌ షఫియోద్దీన్‌, తదిత రులు పాల్గొన్నారు. 

సారంగాపూర్‌: మహిళ చట్టాలపై న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో అ వగాహన కల్పించారు. ఈ సందర్భంగా మండల న్యాయ సేవా సంస్థ అధ్య క్షురాలు హరీష మాట్లాడారు. కార్యక్రమంలో సివిల్‌ జూనియర్‌ జడ్జిలు రా మలింగం, అనూష, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మల్లారెడ్డి పాల్గొన్నారు.

దస్తూరాబాద్‌: మండల కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో క్రాంతి, జడ్పీటీసీ శారద, ఎం పీటీసీలు సునీత, భాగ్యలక్ష్మి, ఎంపీపీ కిషన్‌ పాల్గొన్నారు. 

నిర్మల్‌ అగ్రికల్చర్‌: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో ఎక్సైజ్‌ శాఖలో పని చేస్తున్న మహిళా ఉద్యోగులకు జిల్లా ఎక్సైజ్‌ అ ధికారి రవీందర్‌ రాజు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్‌ సీఐ సం పత్‌ కృష్ణ, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-09T06:02:32+05:30 IST