మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి

ABN , First Publish Date - 2022-05-23T04:05:36+05:30 IST

డ్వాక్రా మహిళలు సంఘాలను అభివృద్ధి చేసుకొని ఆర్థికా భివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. పెద్దపేటలో ఆది వారం గంగాభవాని డ్వాక్రా మహిళా సంఘ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ డ్వాక్రా మహిళల అభ్యున్నతికి సీఎం కేసిఆర్‌ అనేక సం క్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. డ్వాక్రా మహిళ సంఘాల సభ్యులు ప్రభు త్వం అందించే రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు.

మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి
పెద్ధపేటలో డ్వాక్రా భవనాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే దివాకర్‌రావు.

దండేపల్లి, మే 22: డ్వాక్రా మహిళలు సంఘాలను అభివృద్ధి చేసుకొని ఆర్థికా భివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. పెద్దపేటలో ఆది వారం గంగాభవాని డ్వాక్రా మహిళా సంఘ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ డ్వాక్రా మహిళల అభ్యున్నతికి సీఎం కేసిఆర్‌ అనేక సం క్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. డ్వాక్రా మహిళ సంఘాల సభ్యులు ప్రభు త్వం అందించే రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు.  సంఘాల అభివృద్ధికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.10 లక్షల వరకు బ్యాంకుల ద్వారా వడ్డీలేని రుణాలను అందిస్తోందన్నారు. డ్వాక్రా సంఘాల సభ్యులు ఎమ్మెల్యేను సన్మానించారు. ఏఎంసీ వైస్‌చైర్మన్‌ రేణి శ్రీనివాస్‌, సర్పంచులు మాధవిఇస్తాకర్‌, దాసరి శాంతయ్య, ఎంపీటీసీ కమలాకర్‌, మండల అధ్యక్షకార్యదర్శు చుంచు శ్రీనివాస్‌, వెంకటేష్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా యువ నాయకులు విజీత్‌రావు పాల్గొన్నారు.  

 

Updated Date - 2022-05-23T04:05:36+05:30 IST