Abn logo
Aug 31 2020 @ 06:52AM

భర్త లేని సమయంలో ఇంట్లో నుంచి వెళ్లిపోయిన భార్య!

హైదరాబాద్ : భర్త ఇంట్లో లేని సమయంలో  భార్య బయటకు వెళ్లిపోయి తిరిగి రాలేదు. మీర్‌పేట్‌లోని నందనవనంలో నివసించే ఎస్‌కే అక్బర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 25వ తేదీన ఆయన పనిమీద కర్నూల్‌కు వెళ్లాడు. ఆ మరుసటి రోజు ఆయన భార్య నవాబీ(28) ఇంట్లో ఉన్న పిల్లలకు కూడా చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. పిల్లల ద్వారా విషయం తెలుసుకున్న అక్బర్‌ ఇంటికి వచ్చి అంతటా వెతికినా ఫలితం కానరాకపోవడంతో శనివారం రాత్రి మీర్‌పేట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవి అనే మహిళ మీద తమకు అనుమానం ఉన్నదని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Advertisement
Advertisement
Advertisement