Abn logo
Sep 26 2021 @ 00:47AM

ఉక్కు పరిరక్షణకు మహిళలు పాదయాత్ర

నినాదాలు చేస్తున్న మహిళలు

మాజీ కార్పొరేటర్‌ కె.విమల

ఉక్కుటౌన్‌షిప్‌, సెప్టెంబరు 25: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు త్వరలో మహిళలు పాదయాత్ర చేపట్టనున్నారని మాజీ కార్పొరేటర్‌ కె.విమల వెల్లడించారు. ప్లాంట్‌ సీడబ్ల్యూసీ-1లో శనివారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ రైతులు, కార్మికుల సంక్షేమాన్ని కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తున్నదని ఆరోపించారు. ప్రభ్వుత రంగాలను ప్రైవేటీకరించడం వలన అన్ని విధాల చేటన్నారు. మాజీ కౌన్సిలర్‌ వై.వరలక్ష్మి మాట్లాడుతూ కరోనా క్లిష్ట సమయంలో దేశంలో ప్రజలకు ఆక్సిజన్‌ అందించిన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో అడుసుమల్లి దీప్తి, కె.వేణు, పద్మ, లాల్‌మణి, శోభారాణి, శార్వాణి, పద్మజ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.