మహిళలు పోరాడవలసిందే!

ABN , First Publish Date - 2022-08-16T06:11:06+05:30 IST

ముద్దు ముద్దు మాటలతో అధికారంలోకి వచ్చిన వై.యస్.ఆర్.సి.పి. ప్రభుత్వం ఎన్నికల ముందు ఊదరగొట్టిన సంపూర్ణ మద్య నిషేధం ఊసే మరిచింది...

మహిళలు పోరాడవలసిందే!

ముద్దు ముద్దు మాటలతో అధికారంలోకి వచ్చిన వై.యస్.ఆర్.సి.పి. ప్రభుత్వం ఎన్నికల ముందు ఊదరగొట్టిన సంపూర్ణ మద్య నిషేధం ఊసే మరిచింది. పైగా, ప్రభుత్వం తన హామీకి భిన్నంగా మద్యం ధరలు పెంచుతూ కూలి, నాలి చేసుకునే పేదల కడుపు కొడుతోంది. జగన్ మాట నమ్మి ఎందరో మహిళలు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేశారు. ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయం ఇబ్బడిముబ్బడిగా మద్యం నుంచే వస్తున్నందున రాష్ట్రానికి అదే ప్రధాన ఆదాయ వనరుగా మారిపోయింది. వచ్చిన డబ్బంతా తాగుడుకు పోతున్నందున అనేక కుటుంబాలు పతనమవుతున్నాయి. మగవారు తమ సంపాదన అంతా తాగుడుకు ఖర్చు పెట్టి కుటుంబాలను వీధిన పడేస్తున్నారు. సంపూర్ణ మద్యనిషేధం అమలు విషయంలో ఇప్పటికైనా మహిళలు చైతన్యవంతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. ఎవరైనా మద్యం తాగి చనిపోయినప్పుడు మాత్రమే స్పందించడం, మీడియాలో ప్రభుత్వాన్ని నిలదీయడంతో ఊరుకోకుండా, మహిళలంతా మద్యనిషేధం కోసం నిరంతర పోరాటానికి ఉపక్రమించక తప్పదు. 

కనుమ ఎల్లారెడ్డి

Updated Date - 2022-08-16T06:11:06+05:30 IST