కడుపునొప్పి వస్తోందని 47 ఏళ్ల భార్యను ఆస్పత్రికి తీసుకెళ్తే.. స్కానింగ్ తీశాక డాక్టర్లు చెప్పింది విని అవాక్కైన భర్త..

ABN , First Publish Date - 2021-11-18T15:26:12+05:30 IST

అత్యంత అరుదైన చికిత్సలను వైద్యులు..

కడుపునొప్పి వస్తోందని 47 ఏళ్ల భార్యను ఆస్పత్రికి తీసుకెళ్తే.. స్కానింగ్ తీశాక డాక్టర్లు చెప్పింది విని అవాక్కైన భర్త..

అత్యంత అరుదైన చికిత్సలను వైద్యులు విజయవంతంగా నిర్వహిస్తున్న కాలంలో మనం ఉన్నాం. వైద్యులు ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు. ఇటువంటి అద్భుతమే నాగపూర్‌లో చోటుచేసుకుంది. గర్భందాల్చిన ప్రతీ మహిళా ఆ స్థితిని తప్పక గుర్తించగలుగుతుంది. అయితే 47 ఏళ్ల మహిళకు ఈ విషయంలో ఇందుకు భిన్నంగా జరిగింది. ఆమెకు వివాహమైన 17 ఏళ్ల తరువాత గర్భం దాల్చింది. అయితే ఈ విషయంలో ఆమెకు 8వ నెల వచ్చేవరకూ ఆ విషయం తెలియకపోవడం విశేషం. దీంతో ఆమె 8 నెలల పాటు ఎటువంటి వైద్య పరీక్షలు చేయించుకోలేదు. 


ఈ మహిళకు గతంలో బైపాస్ సర్జరీ కూడా జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న మహిళకు డెలివరీ జరిగిన వింత ఘటన నాగపూర్ ఎయిమ్స్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. గడచిన 17 ఏళ్లగా వారు సంతానం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపధ్యంలో వారికి ఊహించని విధంగా సంతాన భాగ్యం కలిగింది. తల్లి,శిశువు క్షేమంగానే ఉన్నారు. ఆ మహిళను నెల రోజుల పాటు ప్రసూతి వైద్యుల సంరక్షణలో ఉంచారు. అక్టోబరు 27న ఆ మహిళకు సిజేరియనే డెలివరీ చేశారు. ఆ సమయంలో శిశువు బరువు 3.2 కిలోగ్రాములుంది. నాలుగేళ్ల క్రితం సరిత అనే ఆ మహిళకు బైపాస్ సర్జరీ జరిగింది. దీనికి తోడు ఆమెకు షుగర్ వ్యాధితోపాటు అధిక రక్తపోటు సమస్య కూడా ఉంది. సంతానం కలిగే వయసు దాటిపోవడంతో పాటు అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నందున సరిత తనకు ఇక సంతానం కలగదని అనుకుంది. అయితే ఇటీవల ఆమెకు కడుపులో నొప్పి వస్తుండటంతో ఆమె భర్త ఎయిమ్స్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమె గర్భవతి అని తేలింది. ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ గుంజన్ ఘోడేశ్వర్, ప్రసూతి వైద్యులు డాక్టర్ నిషాంత్ బనాయిత్‌ల సారధ్యంలో సరితకు సిజేరియన్ డెలివరీ జరిగింది.

Updated Date - 2021-11-18T15:26:12+05:30 IST