Viral Video: రోడ్డుపై జుట్లు పట్టుకుని కొట్టుకున్న ఇద్దరు మహిళలు.. సాధారణంగా ఇప్పుడు అందరూ చేస్తున్న పనే చేసిన అక్కడున్న పురుషులు

ABN , First Publish Date - 2022-09-16T16:26:17+05:30 IST

ఇద్దరు మహిళలు రోడ్డుపై వాదనకు దిగారు. ఆ వాదన క్రమంగా పెద్ద గొడవకే దారి తీసింది. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు మహిళలు.. జుట్టు పట్టుకుని ఒకరినొకరు కొట్టుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. అయితే..

Viral Video: రోడ్డుపై జుట్లు పట్టుకుని కొట్టుకున్న ఇద్దరు మహిళలు.. సాధారణంగా ఇప్పుడు అందరూ చేస్తున్న పనే చేసిన అక్కడున్న పురుషులు

ఇంటర్నెట్ డెస్క్: ఇద్దరు మహిళలు రోడ్డుపై వాదనకు దిగారు. ఆ వాదన క్రమంగా పెద్ద గొడవకే దారి తీసింది. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు మహిళలు.. జుట్టు పట్టుకుని ఒకరినొకరు కొట్టుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్(viral) అవుతుంది. అయితే.. వీడియోలోని దృశ్యాల ప్రకారం.. ఇద్దరు మహిళల మధ్య గొడవ జరుగుతున్నప్పుడు.. అక్కడున్న పురుషులు సాధారణంగా ఇప్పుడు అందరూ చేసిన పనే చేశారు. కాగా.. ఇంతకూ ఆ మహిళలు ఎందుకు కొట్టుకున్నారు? అక్కడున్న మగవాళ్లు ఏం చేశారు? అనే విషయాలు తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే.





ఓ సీఆర్పీఎఫ్ జవాన్(CRPF jawan).. తన భార్య పిల్లలతో కలసి నిహడ్ తాలుకా నుంచి పూణే వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే నాసిక్‌(Nashik)లోని పింపాల్‌గావ్ బస్వంత్ టోల్ ప్లాజా వద్దకు చేరుకున్నారు. టోల్ ప్లాజా సిబ్బందికి తన ఐడీ కార్డును చూపించిన సీఆర్‌పీఎఫ్ జవాన్.. తాను ప్రయాణిస్తున్న వాహనాన్ని వదలాలని కోరాడు. అయితే.. టోల్ ప్లాజా వద్ద పని చేస్తున్న మహిళా సిబ్బంది.. అందుకు నిరాకరించింది. ఐడీ కార్డు చూపితే వాహనాన్ని వదలబోమని చెప్పింది. అంతేకాకుండా టోల్ ఫీజు కట్టాలని సూచించింది. దీంతో జవాన్ భార్య.. ఆ మహిళా సిబ్బందితో వాగ్వాదానికి దిగింది. ఆ వాగ్వాదం కాస్తా.. గొడవకు దారి తీసింది. దీంతో ఇద్దరు మహిళలు(two women fight).. రోడ్డుపై జుట్లు పట్టుకుని మరీ పోట్లాడారు. ఈ సమయంలో అక్కడే ఉన్న మగాళ్లు వారిని ఏమాత్రం అడ్డుకోలేదు. పైగా సోషల్ మీడియాలో(social media) పోస్ట్ చేయడానికి వాళ్లు కొట్లాడుకుంటున్న దృశ్యాలను సెల్ ఫోన్‌లలో చిత్రీకరించారు. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఇద్దరి వాదనలు విని..  ఇరువురికీ నచ్చజెప్పారు. ఒకరికొకరు క్షమాపణ కోరే విధంగా చేసి గొడవను చల్లార్చారు. 


Updated Date - 2022-09-16T16:26:17+05:30 IST