హైకోర్టును దేవాలయంగా భావిస్తూ పూజలు చేసిన మహిళా రైతులు

ABN , First Publish Date - 2020-08-03T23:46:59+05:30 IST

తూళ్లూరు మహిళా రైతులు హైకోర్టును దేవాలయంగా భావిస్తూ పూజలు చేశారు.

హైకోర్టును దేవాలయంగా భావిస్తూ పూజలు చేసిన మహిళా రైతులు

అమరావతి: తూళ్లూరు మహిళా రైతులు హైకోర్టును దేవాలయంగా భావిస్తూ పూజలు చేశారు. హైకోర్టు చిత్రపటంపై పూలు జల్లి హారతులిచ్చారు. మూడు రాజధానుల బిల్లులను గవర్నర్ ఆమోదించిన తర్వాత రైతులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తమను, అమరావతిని రక్షించాల్సిందిక న్యాయస్థానాలేనని, అందుకే న్యాయస్థానాన్ని దేవాలయంగా భావిస్తున్నామంటూ..హైకోర్టు చిత్రపటానికి పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి హారతి ఇచ్చారు. అమరావతి కోసం తమ పోరాటం కొనసాగుతుందని మహిళా రైతులు స్పష్టం చేశారు.

Updated Date - 2020-08-03T23:46:59+05:30 IST