చైన్‌ స్నాచింగ్‌ జరిగిందంటూ మహిళ తప్పుడు ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-07-02T18:02:14+05:30 IST

నడుచుకుంటూ వెళుతుండగా గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు తన మెడలోని..

చైన్‌ స్నాచింగ్‌ జరిగిందంటూ మహిళ తప్పుడు ఫిర్యాదు

హైదరాబాద్ సిటీ/కొత్తపేట : నడుచుకుంటూ వెళుతుండగా గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు తన మెడలోని 2.5 తులాల బంగారు గొలుసు తెంచుకుని పరారయ్యారని ఓ మహిళ తప్పుడు ఫిర్యాదు చేసిన ఘటన ఎల్‌బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎల్‌బీనగర్‌ పరిధిలోని ఎస్‌బీహెచ్‌ వెంచర్‌ -2లో ఉండే పద్మ(55)గృహిణి. ఆమె గురువారం ఉదయం 9.40 గంటలకు కమ్యూనిటీహాల్‌కు వెళుతుండగా తన మెడలోని బంగారు గొలుసును దుండగులు తెంచుకుని పరారయ్యారని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులకు సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించగా చైన్‌ స్నాచింగ్‌ జరుగలేదని తేలింది. ఆమెను విచారించగా ఈ యేడాది జనవరి 28న బంగారు గొలుసును రూ. 65వేలకు తాకట్టు పెట్టినట్టు అంగీకరించింది. తప్పుడు ఫిర్యాదు చేసిన మహిళపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్‌హెచ్‌ఓ అశోక్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2021-07-02T18:02:14+05:30 IST