మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారు

ABN , First Publish Date - 2021-03-08T04:32:47+05:30 IST

నేటి ఆధునిక యుగంలో పురుషులతో సమానంగా మహిళలు రాణిస్తున్నారని అర్బన సీఐ రమే్‌షబాబు పేర్కొన్నారు.

మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారు
బద్వేలులో నిర్వహిస్తున్న క్యాండిల్‌ ర్యాలీ

బద్వేలు రూరల్‌, మార్చి 7: నేటి ఆధునిక యుగంలో పురుషులతో సమానంగా మహిళలు రాణిస్తున్నారని అర్బన సీఐ రమే్‌షబాబు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఆదివారం మహిళా పోలీసులు, అంగన్వాడీలు విద్యార్ధినులతో కలిసి అర్బన పోలీసుస్టేషన నుంచి పురవీధుల్లో క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

నేడు మహిళలు అంతరిక్షంలో అడుగు పెట్టి మహిళల మనోధైర్యాన్ని ఖ్యాతిని ఇనుమడింపజేశారని కొనియాడారు. మహిళలు మనోధైర్యంతో ముందుకు సాగడం అభినందనీయమని, వారికి శుభాకాంక్షలు తెలిపా రు. అర్బన రూరల్‌ ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

సింహాద్రిపురం, మార్చి 7: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సింహాద్రిపురంలో ఎస్‌ఐ ఆధ్వర్యంలో కస్తూర్భా పాఠశాల విద్యార్థినులు క్యాండిల్‌ ప్రదర్శన నిర్వహించారు. గురిజాల రో డ్డు సర్కిల్‌ నుంచి బుడ్డయ్య పాళెం బస్టాండు సర్కిల్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ట్రైనీ ఎస్‌ఐ హృషీకేశవరెడ్డి, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు. 

పోరుమామిళ్ల, మార్చి 7: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని సీఐ మోహనరెడ్డి అన్నారు. మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఆదివారం రాత్రి మహిళలు, విద్యార్ధినులతో పోలీసుస్టేషన నుంచి ఆర్టీసీ బస్టాండు వరకు నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో ఎస్‌ఐ మోహన సిబ్బంది పాల్గొన్నారు.

అట్లూరు, మార్చి7: మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఆదివారం రాత్రి ఎస్‌ఐ శ్రీకాంత ఆధ్వర్యంలో జీఎంఎ్‌సకే, మహిళలు, కేజీబీవీ విద్యార్థులతో అట్లూరు క్రాస్‌ రోడ్డులో కొవ్వత్తులతో ర్యాలీ నిర్వహించి, మానవహారం చేపట్టారు. పోలీసులు, మహిళలు, కేజీబీవీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

దువ్వూరు, మార్చి 7: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని సమాజంలో మహిళ ల రక్షణకు ఏర్పాటు చేసిన చట్టాల గురించి అవగాహన కలిగించేందుకు ఎస్‌ఐ కుళాయప్ప ఆధ్వర్యం లో వై.జంక్షన వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మహిళలు, బాలికలు పాల్గొన్నారు.

బ్రహ్మంగారిమఠం, మార్చి 7: మహిళా దినోత్సవం ముందస్తు వేడుకల్లో భాగంగా బి.మఠం ఎస్‌ఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో కస్తూర్భా పాఠశాల విద్యార్థి నులు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. మహిళల అక్షరాస్యతతోనే దేశాభివృద్ధి సాధ్య మని, మహిళలు లేనిదే సమాజమే లేదన్నారు.

Updated Date - 2021-03-08T04:32:47+05:30 IST