Abn logo
Jul 18 2021 @ 12:53PM

Hospital లో మహిళ మృతదేహాన్ని వదిలేశారు.. చేతిపై ‘ఎం’ టాటూ..!

  • ఇంతకీ ఆ ఇద్దరూ ఎవరు..?
  • సూరారం  ఆస్పత్రిలో ఘటన

హైదరాబాద్ సిటీ/దుండిగల్‌ : సూరారంలోని ఓ ఆస్పత్రిలో ఓ మహిళ మృతదేహాన్ని ఇద్దరు వ్యక్తులు వదిలేసి వెళ్లారు. దుండిగల్‌ పోలీసులు ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దుండగుల కోసం గాలిస్తున్నారు. ఈ నెల 16న ఉదయం 10.25 గంటల సమయంలో గుర్తు తెలియని ఇద్దరు దాదాపు 25 ఏళ్ల వయసున్న ఓ మహిళను ఆటోలో ఓ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆమెను పరిశీలించిన డ్యూటీ డాక్టర్‌ అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ క్రమంలో మృతదేహాన్ని తీసుకొచ్చిన ఇద్దరూ అక్కడి నుంచి జారుకున్నారు. ఆస్పత్రి వర్గాలు పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు వచ్చి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. చనిపోయిన మహిళ ఎడమ చేతిపై లక్ష్మి అనే టాటూ ఉంది. కుడి చేతిపై ‘ఎం’ అనే అక్షరం ఉంది. ఎవరైనా గుర్తిస్తే దుండిగల్‌ పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

క్రైమ్ మరిన్ని...