కార్మిక వర్గ చైతన్యంతో మహిళా దినోత్సవం: జగన్‌

ABN , First Publish Date - 2021-03-04T08:02:39+05:30 IST

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కార్మిక వర్గ చైతన్యంతో పాటించాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది.

కార్మిక వర్గ చైతన్యంతో మహిళా దినోత్సవం: జగన్‌

హైదరాబాద్‌, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కార్మిక వర్గ చైతన్యంతో పాటించాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ అధికార ప్రతినిధి జగన్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలో ఇటీవల జరుగుతున్న ప్రజా ఉద్యమాల్లో మహిళా భాగస్వామ్యం పెరిగిందని మావోయిస్టు పార్టీ తెలిపింది. మహిళలు విశాల ప్రపంచంలోకి రావడం ఒక ముందడుగు అయినప్పటికీ వారి పట్ల కొనసాగుతోన్న శ్రమ దోపిడీ వల్ల వారికి కలుగుతోన్న కష్టం, నష్టం ఎక్కువగా ఉన్నాయన్నారు. 

Updated Date - 2021-03-04T08:02:39+05:30 IST