ఢిల్లీని గెలిచిన శ్రీకాళహస్తి మహిళ

ABN , First Publish Date - 2022-03-08T12:29:36+05:30 IST

ఢిల్లీని గెలిచిన శ్రీకాళహస్తి మహిళ

ఢిల్లీని గెలిచిన శ్రీకాళహస్తి మహిళ

శ్రీకాళహస్తి : స్త్రీల చేతివేళ్లలోనే కళ దాగి ఉంటుంది. కలంకారీ కుటుంబంలో పుట్టిన మునిరత్నమ్మకు బొమ్మలు గీయడం,  రంగులు వేయడం ఉగ్గుపాలతోనే మొదలైంది. ఆ సాధనా నైపుణ్యమే ఆమెను జాతీయ అవార్డు గ్రహీతను చేశాయి. రెండున్నర మీటర్ల గుడ్డమీద సృష్టించిన సంపూర్ణరామాయణం చిత్రానికి 2008లో తమ్ముడితో కలిసి ఢిల్లీలో అవార్డు అందుకుంది. అంతకు ముందు 1997లో శివపురాణం చిత్రానికి తమిళనాడు నుంచి విక్టోరియా అవార్డు కైవసం చేసుకున్న మునిరత్నమ్మ, 2001లో ఏపీ హస్తకళల సంస్థ అవార్డునూ పొందింది.  తండ్రి మునిరెడ్డి, చిన్నాన్న మునికృష్ణారెడ్డిలే ఈమెకు గురువులు. ఇంటర్‌కే చదువు పరిమితం అయినా కలంకారీలో ఢిల్లీని గెలిచిన తొలి మహిళగా శ్రీకాళహస్తికి ఖ్యాతి తెచ్చింది.

Updated Date - 2022-03-08T12:29:36+05:30 IST