మూడేళ్లలో 65 మ్యాచ్‌లు

ABN , First Publish Date - 2022-08-17T10:04:48+05:30 IST

మహిళల క్రికెట్‌కు సంబంధించిన భవిష్యత్‌ టూర్‌ ప్రోగామ్‌ (ఎఫ్‌టీపీ)ను ఐసీసీ తొలిసారి విడుదల చేసింది. ద్వైపాక్షిక సిరీ్‌సలకు సంబంధించి మే, 2022 నుంచి..

మూడేళ్లలో 65 మ్యాచ్‌లు

 2 టెస్టులు, 27 వన్డేలు,  36 టీ20లు ఆడనున్న భారత్‌

 తొలిసారి మహిళల ఎఫ్‌టీపీ ప్రకటించిన ఐసీసీ

దుబాయ్‌: మహిళల క్రికెట్‌కు సంబంధించిన భవిష్యత్‌ టూర్‌ ప్రోగామ్‌ (ఎఫ్‌టీపీ)ను ఐసీసీ తొలిసారి విడుదల చేసింది. ద్వైపాక్షిక సిరీ్‌సలకు సంబంధించి మే, 2022 నుంచి ఏప్రిల్‌ 2025 సైకిల్‌లో జరిగే 301 మ్యాచ్‌ల (7 టెస్టులు, 135 వన్డేలు, 159 టీ20లు) షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. ఈ మూడేళ్లలో భారత్‌.. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియాలతో కలిపి ఒక్కో టెస్టు, 27 వన్డేలు, 36 టీ20లు (మొత్తం 65 మ్యాచ్‌లు) ఆడనుంది. కాగా, ఈ ఎఫ్‌టీపీలో లంకతో 3 వన్డేలు, 3 టీ20లను భారత్‌ ఈపాటికే ఆడేసింది.


న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా, వెస్టిండీ్‌సలకు భారత్‌ ఆతిథ్యం ఇవ్వనుండగా.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ పర్యటనలకు వెళ్లనుంది. కాగా, ఇండో-పాక్‌ మధ్య ఒక్క ద్వైపాక్షిక సిరీ్‌సను కూడా షెడ్యూల్‌ చేయలేదు. ఈ ఏడాది అక్టోబరులో జరిగే చాన్సున్న ఆసియా కప్‌ కోసం కూడా విండోను ఏర్పాటు చేశారు. 2022-25 మహిళల చాంపియన్‌షి్‌పలో భాగంగా..  2025 వరల్డ్‌కప్‌ ముందు ప్రతి జట్టూ వన్డే ఫార్మాట్‌లో 3 ద్వైపాక్షిక సిరీ్‌సలు ఆడనుంది. ఆ టూర్‌లో టీ20లు కూడా ఉంటాయి. ఐసీసీ ఈవెంట్ల క్వాలిఫయింగ్‌ ర్యాంక్‌ల కోసం ఆయా ఈవెంట్లలోని పాయింట్లను పరిగణనలోకి తీసుకొంటామని ఐసీసీ పేర్కొంది. 

Updated Date - 2022-08-17T10:04:48+05:30 IST