Abn logo
Sep 21 2021 @ 00:21AM

బ్యాటింగ్‌కు పరీక్ష!

  • ఆసీ‌స్‌తో భారత మహిళల తొలి వన్డే నేడు

మెకాయ్‌: బ్యాటింగ్‌ వైఫల్యాల కారణంగా వరుస సిరీస్‌ ఓటములతో డీలా పడిన భారత మహిళల జట్టుకు కంగారూల రూపంలో కఠిన పరీక్ష ఎదురుకానుంది. మూడు వన్డేల సిరీ్‌సలో భాగంగా మంగళవారం జరిగే తొలి మ్యాచ్‌లో పటిష్ఠ ఆస్ట్రేలియాతో మిథాలీ సేన తలపడనుంది.   బొటన వేలి గాయం కారణంగా హర్మన్‌ప్రీత్‌ తొలి వన్డేకు దూరమైంది. కండర గాయం కారణంగా గత నెలలో జరిగిన హండ్రెడ్‌ టోర్నీ నుంచి హర్మన్‌ మధ్యలోనే తప్పుకొంది. కానీ, ఆమె ఫిట్‌గా ఉండడంతోనే ఆసీస్‌ పర్యటనకు ఎంపిక చేసినట్టు కోచ్‌ వివరణ ఇచ్చాడు.