రిజర్వాయర్‌లో మహిళ మృతదేహం

ABN , First Publish Date - 2021-05-18T05:54:09+05:30 IST

అవుకు రిజర్వాయర్‌లో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైనట్లు ఎస్‌ఐ జగదీశ్వర్‌రెడ్డి సోమవారం తెలిపారు.

రిజర్వాయర్‌లో మహిళ మృతదేహం

అవుకు, మే 17: అవుకు రిజర్వాయర్‌లో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైనట్లు ఎస్‌ఐ జగదీశ్వర్‌రెడ్డి సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ మృతదేహం రిజర్వాయర్‌లో తేలియాడుతుండగా జాలర్ల సహాయంతో బయటకు తీశామన్నారు. మహిళ శరీరం ఉబ్బి గుర్తు పట్టలేని విధంగా ఉందన్నారు. మృతదేహాన్ని పోస్టుమాస్టరం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2021-05-18T05:54:09+05:30 IST