Advertisement
Advertisement
Abn logo
Advertisement

షాప్‌లోకి వచ్చి వస్తువులన్నీ పారేసి వీరంగం.. ఐదు నెలల గర్భవతిపై దాడి.. కారణమేంటో తెలిస్తే షాక్..!

ఆ దంపతులు కొత్తగా కాస్మొటిక్స్ షాప్ తెరిచారు.. ఆ సెంటర్లో అప్పటికే మరో షాప్ ఉంది.. వీరు కొత్తగా షాప్ పెట్టాక వారి బిజినెస్ తగ్గింది.. దాన్ని జీర్ణించుకోలేక అవతలి వారు దాడికి తెగబడ్డారు.. షాప్‌లోని వస్తువులన్నీ బయట పారేశారు.. ఐదు నెలల గర్భవతి అని కూడా చూడకుండా విచక్షణారహితంగా కొట్టారు.. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.. రాజస్థాన్‌లోని భన్సారాలో ఈ ఘటన జరిగింది.


భన్సారాలోని గంగారావు కాలనీలో రజిత్ హల్దార్ అనే వ్యక్తి తాజాగా కాస్మొటిక్స్ దుకాణం పెట్టాడు. ఆ ఏరియాలో అప్పటికే ఊర్మిళా జైన్ అనే మహిళ కాస్మొటిక్స్ దుకాణం నిర్వహిస్తోంది. రజిత్ పెట్టిన దుకాణం వల్ల ఊర్మిళ వ్యాపారం దెబ్బతింది. దీంతో ఆమె రజిత్‌పై కోపం పెంచుకుంది. బుధవారం సాయంత్రం రజిత్ లేనపుడు అతడి దుకాణం వద్దకు ఊర్మిళ, ఆమె కూతురు సాక్షి, కొడుకు శోభిత్‌తో కలిసి వెళ్లింది. దుకాణంలోని సామాన్లను తీసి కింద పడేసింది.  


ఆ సమయంలో రజిత్ భార్య మాత్రమే దుకాణంలో ఉంది. ఆమె ఐదు నెలల గర్భవతి. ఆమెపై ఊర్మిళ, ఆమె పిల్లలు దాడికి తెగబడ్డారు. ఐదు నెలల గర్భవతి అని కూడా చూడకుండా ఆమెను కొట్టారు. దీంతో ఆమె అస్వస్థతకు గురైంది. ఆమె అరుపులు విన్న చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకున్నారు. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న రజిత్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement