మహిళలూ సాధించగలరు

ABN , First Publish Date - 2020-02-20T06:28:42+05:30 IST

వ్యాపారంలోకి మహిళలు ప్రవేశించడమే కష్టం. అందు నా ఔషధ రంగంలోకి అడుగు పెట్టడం

మహిళలూ సాధించగలరు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): వ్యాపారంలోకి మహిళలు ప్రవేశించడమే  కష్టం. అందు నా ఔషధ రంగంలోకి అడుగు పెట్టడం మరీ కష్టమైన రోజుల్లో ఆ వ్యాపారంలోకి అడుగు పెట్టి విజయవంతంగా దాన్ని నిర్వహిస్తున్నట్లు పిరామల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ వైస్‌ చైర్మన్‌ స్వాతి పిరామల్‌ అన్నారు. రూ.10 కోట్ల కంపెనీ సొంతం చేసుకుని పిరామల్‌ లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీని రూ.5,000 కోట్ల కంపెనీ స్థాయికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. తన తండ్రి ప్రోత్సాహం వల్లే ఔషధ రంగాన్ని ఎంచుకున్నట్లు చెప్పారు. ‘లైఫ్‌ సైన్సెస్‌ హెల్త్‌కేర్‌ రంగంలో మహిళలు- జర్నీ ఫ్రమ్‌ యాస్పిరేషన్‌ టు ఇన్‌స్పిరేషన్‌’ అనే అంశంపై ఆమె మాట్లాడారు. ప్రస్తుతం పిరామల్‌ లైఫ్‌ సైన్సెస్‌ ఆర్‌ అండ్‌ డీ విభాగంలో 50 శాతం మంది, ఇతర అన్ని విభాగాల్లో 21 శా తం మంది మహిళలే ఉన్నారని స్వాతి తెలిపారు. పిల్లలు పుట్టిన తర్వాత  మళ్లీ ఉద్యోగం చేయాలనుకునే మహిళలకు తగిన వాతావరణం కల్పించాలి.  దాని వల్ల నిపుణులను తిరిగి పొందవచ్చు. భవిష్యత్తులో లైఫ్‌ సైన్సెస్‌ రంగంలోకి మరింత మంది మహిళలు రావాలి. 


తెలంగాణ ఈ రంగంలో ముందుందన్నారు. 10 లక్షల మంది ఆడపిల్లలకు లైఫ్‌ సైన్సెస్‌, లెక్కల్లో సరైన శిక్షణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. దీనివల్ల ఈ రంగంలోకి కొత్త వారు రాగలరని చెప్పారు.


మధ్య తరగతి నుంచి వచ్చాను

తాను మధ్యతరగతి నుంచి వచ్చానని.. తన  కంటే ముందు కుటుంబ సభ్యులెవరూ వ్యాపారంలో లేరని ఇంటెల్‌ ఇండియా అధిపతి నివృతి రాయ్‌ అన్నారు. భయం లేకుండా పని చేయాలని, అన్ని పరిస్థితులకు అనుగుణంగా ఉండాలని మహిళలకు సూచించారు. తప్పు జరిగితే ఒప్పుకోవాలని.. తప్పులు చేస్తేనే నైపుణ్యాలు పెరుగుతాయన్నారు. టెక్నాలజీని గ్రామీణ స్థాయికి తీసుకువెళ్లి అక్కడి వారికి ప్రపంచ స్థాయి అవకాశాలను కల్పించడం తన లక్ష్యమని తెలిపారు. వివిధ కారణాల వల్ల ఉద్యోగాలు మానేసిన మహిళలకు 9 నెలలు శిక్షణనిచ్చి మళ్లీ జాబ్‌లో కొనసాగేలా చేస్తు న్నాం. ప్రతి ఏడాది మహిళా వెండర్ల నుంచి 20 మిలియన్‌ డాలర్ల ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నట్లు రాయ్‌ చెప్పారు. తమ కంపెనీలో అన్ని విభాగాల్లో 30 శాతం మంది మహిళలు ఉన్నారని శాండజ్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌, ఇండియా అధిపతి అలెంకా స్టెఫనిక్‌ పీటెక్‌ తెలిపారు. 

Updated Date - 2020-02-20T06:28:42+05:30 IST