Abn logo
Mar 7 2021 @ 23:38PM

మహిళల్లో చైతన్యం పెరగాలి

భీమవరం క్రైం, మార్చి 7 : మహిళలో చైతన్యం పెరగాలని నరసాపురం డీఎస్పీ వీరాంజనేయరెడ్డి అన్నారు. సోమవారం ప్రపంచ మహిళా దినోత్స వం సందర్భంగా మహిళల్లో చైతన్యం పెంపొందించేందుకు ఆదివారం రాత్రి పోలీసులు, మహిళా పోలీసులు, సచివాలయ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. డీఎస్పీ వీరాంజనేయరెడ్డి మా ట్లాడుతూ ఇటీవల కాలంలో మహిళలపై దాడులు పెరిగాయని, పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో మహిళలకు రక్షణ కల్పిస్తున్నామన్నారు. దిశ యాప్‌ ద్వారా అఘాయిత్యాలు, దాడుల నివారణకు పోలీస్‌శాఖ కృషి చేస్తుందని తెలిపారు. సీఐలు కృష్ణభగవాన్‌, విజయ్‌కుమార్‌, ఎస్‌ఐలు రాంబాబు, శ్రీనివాస్‌, వెంకటేశ్వరరావు, సుధాకర్‌రెడ్డి, మహిళా పోలీసులు, సచివాలయ మహిళా పోలీసులు, స్వచ్ఛంద సంస్ధల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

ఆకివీడులో పోలీసుల శాఖ ఆధ్వర్యంలో మహిళల ర్యాలీ

స్త్రీలను గౌరవించిన చోటే అభివృద్ధి


ఆకివీడు: మహిళ గౌరవించబడిన చోటే అభివృద్ధి ఉంటుందని ఎస్‌ఐ వీఎస్‌.వీరభద్రరావు అన్నారు. జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని పోలీసు శాఖ ఆధ్వర్యంలో సచివాలయ, వాలంటరీ, ఏఎన్‌ఎం, అంగన్‌వాడీ, ఆశా తదితర మహిళలు గాంధీజీ సెంటర్‌ వరకు ఆదివారం కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టి మానవహరం నిర్వహించారు. మహిళలు నేడు సమాజంలో కీలకపాత్ర పోషిస్తున్నారన్నారు. పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారన్నారు. స్త్రీ అభ్యుదయమే ప్రగతికి సంకేతమన్నారు. కార్యక్రమంలో మోరా జ్యోతి, ఏఎస్‌ఐ డి.సంజీవరావు, రైటర్‌ జయరాజు, హెడ్‌ కానిస్టేబుల్స్‌ కానిస్టేబుల్స్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పాలకొల్లులో కొవ్వొత్తులతో మహిళల ర్యాలీ

మహిళలు స్వయం ప్రతిపత్తిని సాధించాలి


పాలకొల్లు టౌన్‌: మహిళలు ఆర్థికంగా స్వయం ప్రతిపత్తి సాధించి, ధైర్యంగా ముందుకు సాగాలని పట్టణ సీఐ సీహెచ్‌.ఆంజనేయులు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా పట్టణ, రూరల్‌ సీఐలు సీహెచ్‌. ఆంజనేయులు, దేశింశెట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మహిళా సంరక్షణ కార్యద ర్శులు, వార్డు వలంటీర్లు ఆదివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సీఐ ఆంజనేయులు మాట్లాడుతూ మహిళలు పురుషలతో సమానంగా అన్ని అంశాల్లో ముందుండాలన్నారు. ఆర్థిక, సామాజికంగా స్వతంత్ర నిర్ణయాలతో గుర్తింపు తెచ్చు కోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పట్టణ, రూరల్‌ ఎస్‌ఐలు రహ్మన్‌, జేవీ ఎన్‌.ప్రసాద్‌, పి.అప్పారావు, ఏఎస్‌ఐ ఏసుబాబు, జాషువా, సిబ్బంది, మహిళా సంరక్షణ కార్యదర్శులు జాహ్నవి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement