‘టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బారి నుంచి కాపాడండి’

ABN , First Publish Date - 2020-09-25T11:41:13+05:30 IST

నల్లగొండజిల్లా మిర్యాలగూడ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే భాస్కర్‌రావు.. తన కుటుంబంపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారంటూ మణెమ్మ అనే ఓ మహిళ ఆరోపించారు.

‘టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బారి నుంచి కాపాడండి’

హైదరాబాద్ : నల్లగొండజిల్లా మిర్యాలగూడ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే భాస్కర్‌రావు.. తన కుటుంబంపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారంటూ మణెమ్మ అనే ఓ మహిళ ఆరోపించారు. కబ్జాదారులకు వత్తాసు పలుకుతూ.. ఎమ్మెల్యే తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. న్యాయవాదైన తన భర్త బుచ్చిబాబు.. ఎమ్మెల్యే బాధితుల తరఫున కేసులు వాదిస్తున్నందుకు కక్షగట్టారని వాపోయారు. ఈ మేరకు గురువారం నాంపల్లిలోని రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే భాస్కర్‌ రావు అక్రమాలకు అడ్డొచ్చిన తన భర్త, కొడుకు, ఇతర కుటుంబసభ్యులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

Updated Date - 2020-09-25T11:41:13+05:30 IST