మహిళా సాధికారతపై అవగాహన

ABN , First Publish Date - 2020-11-29T05:20:43+05:30 IST

మహిళా సాధికారతపై అవగాహన

మహిళా సాధికారతపై అవగాహన
మాట్లాడుతున్న మేడ్చల్‌ కోర్టు సీనియర్‌ సివిల్‌ జడ్జి

మేడ్చల్‌: మేడ్చల్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో శనివారం జిల్లా న్యాయసేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో మహిళా సాధికారతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయసేవాధికారి సంస్థ కార్యదర్శి జి.ఉదయ్‌కుమార్‌ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లా న్యాయసేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో అందించే ఉచిత న్యాయసేవల గురించి వివరించారు. రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయవాదులు వి.సరళ, హేమలత, దీపికారెడ్డి, విద్యారెడ్డిలు మాట్లాడుతూ మహిళా సాధికారత, చట్టాల గురించి వివరించారు. మేడ్చల్‌ కోర్టు సీనియర్‌ సివిల్‌ జడ్జి డి.వరూధిని జాతీయ మహిళా కమిషన్‌ గురించి వివరించారు. కార్యక్రమంలో జిల్లా శిశు సంక్షేమ అధికారి జ్యోతిపద్మ మాట్లాడుతూ మహిళల సమస్యలను పరిష్కరించడానికి మహిళాభివృద్ధి సంక్షేమశాఖ తరఫున మహిళా కమిషనర్‌, ప్రతి జిల్లాలో సబ్‌ సెంటర్లు పనిచేస్తున్నాయని తెలిపారు. మహిళలకు సంబంధించిన ఏ సమస్య అయినా సబ్‌సెంటర్ల ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. 181 హెల్ప్‌లైన్‌ ఫోన్‌ నంబరుకు ఫోన్‌ద్వారా వారి సమస్యలను తెలిపి సహాయం పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ సీఈఓ దేవసహాయం, ఏసీడీపీఓ కోఆర్డినేటర్‌ ప్రియాంక, సూపర్‌వైజర్‌ హైమావతి, అంగన్‌వాడీ టీచర్లు, ఆశావర్కర్లు, సెల్ఫ్‌హెల్ప్‌ గ్రూపుసభ్యులు పాల్గొన్నారు.

 


Updated Date - 2020-11-29T05:20:43+05:30 IST