Viral Video: విమానంలో ఓ మహిళ వింత చర్య.. విండో సీట్లోకి వెళ్లేందుకు ఎవరూ ఊహించని రీతిలో..

ABN , First Publish Date - 2022-06-22T19:03:51+05:30 IST

విమానంలో ఓ మహిళ వింత చర్య, దాని తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Viral Video: విమానంలో ఓ మహిళ వింత చర్య.. విండో సీట్లోకి వెళ్లేందుకు ఎవరూ ఊహించని రీతిలో..

ఇంటర్నెట్ డెస్క్: విమానంలో ఓ మహిళ వింత చర్య, దాని తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తనకు కేటాయించిన విండో సీట్లోకి వెళ్లేందుకు ఆ మహిళ చేసిన పనిని కొందరు నెటిజన్లు విమర్శిస్తుంటే, మరికొందరు మద్దతు తెలుపుతున్నారు. ఇంతకీ ఆ మహిళ ఏం చేసింది? ఆ వీడియో అంతలా వైరల్ కావడానికి కారణం ఏంటి? వివరాల్లోకి వెళ్తే.. ఈ వీడియోను బ్రాండన్ అనే ఓ ట్విటర్ యూజర్ పోస్ట్ చేశాడు. వీడియోలో ఓ ప్రయాణికురాలు తనకు కేటాయించిన విండో సీట్లోకి వెళ్లేందుకు వింత చర్యకు పాల్పడడం ఉంది. ఇలాంటి దృశ్యాలు మాములుగా ఏ బస్సుల్లోనో, రైళ్లల్లోనో కనిపిస్తుంటాయి. జనాలు ఫుల్లుగా ఉన్నప్పుడు ముందే ఎవరైనా మనోళ్లు వాటిలోకి ఎక్కి మన కోసం సీటు ఆపినప్పుడు ముందున్నవారిని దాటుకుని వెళ్లి మరీ మన సీట్లో కుర్చుంటాం. 


ఇదిగో అచ్చం ఇలాంటి సీనే ఓ విమానంలో జరిగింది. ఇక విమానంలో అయితే ముందుగానే టికెట్లు రిజర్వేషన్ కావడం, మన సీట్లు మనకు కేటాయించడం జరుగుతుంది. ఇలా ఓ ప్రయాణికురాలు తనకు కేటాయించిన విండో సీట్ కోసం చిన్నపాటి సాహసమే చేసింది. తన విండో సీట్ కంటే ముందున్న మూడు సీట్లలో అప్పటికే ముగ్గురు ప్రయాణికులు కూర్చొని ఉండడంతో వారిపై నుంచి దాటుకుని వెళ్లి మరీ తన సీట్లో కూర్చుంది. ఆమె వింత చర్యను వీడియో తీసిన బ్రాండన్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. దాంతో ఈ వీడియా వైరల్ అయింది. "నేను విమానంలో చూసిన అత్యంత నేరపూరిత చర్య" అంటూ బ్రాండన్ దీనికి క్యాప్షన్ ఇచ్చాడు. 


దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో భిన్నంగా స్పందిస్తున్నారు. ఓ నెటిజన్ ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించాడు. "ఆమె అలా చేస్తుంటే విమాన అటెండెంట్లు ఏం చేస్తున్నారు. పైగా ఎవరూ ఆమెను ఆపే ప్రయత్నం కూడా చేయలేదు" అని తెలిపాడు. మరో నెటిజన్.. "అప్పటికే కూర్చుకున్న ప్రయాణికులతో మాట్లాడి వారిని లేపిన తర్వాత వెళ్లి కూర్చుంటే సరిపోయేదని" కామెంట్ చేశాడు. ఇంకో నెటిజన్ మాత్రం "అందులో తప్పేముంది. కూర్చుకున్నవారికి లేని సమస్య మాట్లాడేవారికి ఎందుకో? ఆమె అలా వారిని దాటుకుంటూ వెళ్తుంటే కింద సీట్లో కూర్చున్న వారే ఏమీ మాట్లాడాలేదుగా" అని చెప్పుకొచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది. ఇప్పటివరకు 6వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.       



Updated Date - 2022-06-22T19:03:51+05:30 IST