19 కిలోల కడుపు.. నరకయాతనలో మహిళ!

ABN , First Publish Date - 2020-08-07T05:28:27+05:30 IST

చైనాకు చెందిన హువాంగ్ గియోక్సాన్ మహిళ రెండేళ్లుగా ఓ విచిత్ర రోగంతో నానా అవస్థలు పడుతోంది.

19 కిలోల కడుపు.. నరకయాతనలో మహిళ!

బీజింగ్: చైనాకు చెందిన హువాంగ్ గియోక్సాన్ మహిళ రెండేళ్లుగా ఓ విచిత్ర రోగంతో నానా అవస్థలు పడుతోంది. ఆమె ఉదర భాగం విపరీతంగా పెరిగిపోయింది. గత రెండేళ్లుగా అది పెరిగి.. ప్రస్తుతం 19 కేజీల పరిమాణానికి చేరుకుంది. దీంతో ఆమె చిత్ర హింసలు అనుభిస్తోంది. దీనికి కారణమేంటో కూడా స్థానిక డాక్టర్లు చెప్పలేకపోయారు.  అయితే ఆమెకు లివర్ సిర్రోసిస్, గాల్ బ్లాడర్‌కు సంబంధించిన సమస్యలు ఉన్నాయని మాత్రం వారు గుర్తించారు.  వాపు తగ్గించేందుకు వారు చేసిన ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టాయి. నొప్పి నివారించే మందుల ద్వారానే ఆమె ప్రస్తుతం నెట్టుకోస్తోంది. కానీ ఇంతటి భారీ ఉదరం.. ఆమె రోజువారి పనులకు అడ్డుతగులుతోంది. కన్న పిల్లల బాధ్యతలు కూడా ఆమె వేరేవారిపై వదిలేయాల్సి వచ్చింది. అయితే తన సమస్యకు ఓ స్పెషలిస్టు దగ్గర దొరుకుతుందని ఆమెకు ఇటీవలే తెలిసింది. కానీ ఇది పెద్ద ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో ఆమె సోషల్ మీడియాలో తన బాధ వెళ్లబోసుకుంది. దయగల వారు స్పందించడంతో ఆమెకు  4,320 డాలర్లు విరాళాల రూపంలో సమకూరాయి. దీంతో తన సమస్యకు ఫుల్ స్టాప్ పడే సమయం వచ్చిందని ఆమె సంబరపడుతోంది. 

Updated Date - 2020-08-07T05:28:27+05:30 IST