2021 చివరి రోజున తీసుకున్న నిర్ణయం.. మహిళ జీవితంలో ఊహించని ట్విస్ట్.. ఒక్కసారిగా కనకవర్షం..

ABN , First Publish Date - 2022-01-23T02:13:35+05:30 IST

అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పడం కష్టం. కానీ.. అదృష్ట దేవత ఒక్కసారి కరుణిస్తే చాలు.. రాత్రికి రాత్రి జీవితం మొత్తం మారిపోతుంది. అంతకుముందు పడిన బాధంతా ఒక్క క్షణంలో మాయమైపోయి..ప్రపంచం రంగులమయంగా మారిపోతుంది. అమెరికాలోని ఓక్లహోమా రాష్ట్రానికి చెందిన లారా స్పియర్స్‌కు అదృష్టం అచ్చం ఇలాగే

2021 చివరి రోజున తీసుకున్న నిర్ణయం.. మహిళ జీవితంలో ఊహించని ట్విస్ట్.. ఒక్కసారిగా కనకవర్షం..

ఇంటర్నెట్ డెస్క్: అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పడం కష్టం. కానీ.. అదృష్ట దేవత ఒక్కసారి కరుణిస్తే చాలు.. రాత్రికి రాత్రి జీవితం మొత్తం మారిపోతుంది. అంతకుముందు పడిన బాధంతా ఒక్క క్షణంలో మాయమైపోయి..ప్రపంచం రంగులమయంగా మారిపోతుంది. అమెరికాలోని ఓక్లహోమా రాష్ట్రానికి చెందిన లారా స్పియర్స్‌కు అదృష్టం అచ్చం ఇలాగే ఊహించని విధంగా తలుపు తట్టింది. మరో వ్యక్తి నుంచి రావాల్సిన ఈ-మెయిల్ కోసం ఆమె తన అకౌంట్‌‌లో చెక్ చేయగా కావాల్సిన మెయిల్ కనిపించలేదు. ఎందుకైనా మంచిదని ఆమె స్పామ్ ఫోల్డర్‌( ప్రాధాన్యత లేని సందేశాలు ఉండే ఫోల్డర్)లోనూ వెతికింది. ఈ క్రమంలో లారా అనూహ్యంగా  కోటీశ్వరురాలైంది.


గతేడాది డిసెంబర్ 31న ఆమె ఫేస్‌బుక్‌లో జాక్‌పాట్(మెగామిలియన్ జాక్‌పాట్) లాటరీకి సంబంధించిన ఓ యాడ్ చూసింది. కాసేపు..ముందువెనకలాడాక.. ఆమె ఎట్టకేలకు లాటరీ టిక్కెట్టు కొనేందుకే నిర్ణయించుకుంది. ఆ తరువాత.. ఆ విషయాన్నే మర్చిపోయింది. ఇటీవల ఓ రోజు.. మరో మెయిల్ కోసం తన అకౌంట్‌లో చెక్ చేస్తుండగా.. లాటరీ వచ్చిదంటూ కంపెనీ పంపించిన మెయిల్‌పై ఆమె దృష్టిపడింది. అంతే.. ఆ క్షణంలోనే ఆమె లైఫ్ మొత్తం ఛేంజైపోయింది. ఆ మరుసటి రోజు ఆమె వెళ్లి తాను గెలుచుకున్న మొత్తాన్ని తెచ్చుకుంది. ఏకంగా మూడు మిలియన్ డాలర్లు(రూ. 22 కోట్లు) తన సొంతమవడంతో ఆమె ఆనందానికి అంతేలేకుండా పోయింది. ఇందులో కొంత మొత్తాన్ని తన వారికి ఇస్తానన్న ఆమె.. త్వరలోనే ముందస్తు రిటైర్మెంట్ తీసుకుంటానని కూడా పేర్కొంది.

Updated Date - 2022-01-23T02:13:35+05:30 IST