అపానవాయువు అమ్ముకుంటూ కోట్లు కొల్లగొడుతున్న మహిళ.. అతిగా ట్రై చేయడంతో ఊహించని షాక్!

ABN , First Publish Date - 2022-01-07T01:29:48+05:30 IST

అపానవాయువు అమ్ముకుంటూ కోట్లు కొల్లగొడుతున్న అమెరికా మహిళ స్టెఫానీ మ్యాట్ తాజాగా రిటైర్మెంట్ ప్రకటించింది. స్వస్థి చెప్పక తప్పని పరిస్థితి వచ్చిందని స్టిఫానీ తేల్చి చెప్పడంతో ఆమె అభిమానులు నిరాశలో కూరుకుపోయారు.

అపానవాయువు అమ్ముకుంటూ కోట్లు కొల్లగొడుతున్న మహిళ.. అతిగా ట్రై చేయడంతో ఊహించని షాక్!

ఇంటర్నెట్ డెస్క్: అపానవాయువు అమ్ముకుంటూ కోట్లు కొల్లగొడుతున్న అమెరికా మహిళ స్టెఫానీ మ్యాట్ తాజాగా రిటైర్మెంట్ ప్రకటించింది. స్వస్థి చెప్పక తప్పని పరిస్థితి వచ్చిందని స్టిఫానీ తేల్చి చెప్పడంతో ఆమె అభిమానులు నిరాశలో కూరుకుపోయారు. ఈ ఉదంతం ప్రస్తుతం తెగ వైరల్‌గా మారింది. తన అపానవాయువును చిన్న చిన్న గాజు డబ్బాల్లో ప్యాక్ చేసి విక్రయించే స్టిఫానీ వారానికి కనీసం రూ. 38 లక్షలు(మన కరెన్సీ ప్రకారం.) సంపాదించేది. గతేడాది నవంబర్‌లోనే ఆమె ఈ కొత్త వ్యాపారాన్ని ప్రారంభించింది. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుండటంతో చూస్తుండగానే ఆమె వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందింది.


ఒకనాకొక సమయంలో ఆమె వారానికి  50 డబ్బాల వరకూ విక్రయించేది. అయితే..కస్టమర్ల నుంచి ఆర్డర్లు విపరీతంగా వచ్చి పడుతుండటంతో ఆమె తన ప్రయత్నాలను మరింత తీవ్రతరం చేసింది. వీలైనంత ఎక్కువగా అపానవాయువు వచ్చేలా ఆమె ప్రత్యేకమైన డైట్‌ను సిద్ధం చేసుకుంది. బీన్స్, పీచు పదార్థం ఎక్కువగా ఉన్న వంటకాలు, గుడ్లు.. అధికంగా తీసుకొంటూ అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది.  అయితే..వీటితో పాటూ ప్రోటీన్ షేక్స్ కూడా తన  ఆహారంలో భాగం చేస్తే అపానవాయువు మరింత పవర్‌ఫుల్‌గా మారుతుందని గుర్తించిన ఆమె వాటిని కూడా అధిక మొత్తంలో సేవించడం ప్రారంభించింది. 


అంతా సవ్యంగా గడిచిపోతోందనుకున్న తరుణంలో ఆమెకు ఇటీవల ఊహించని షాక్ తగిలింది.  ‘‘ఆ రోజు నాకు బాగా గుర్తే.. నేనారోజు నాలుగు ప్రొటీన్ షేక్స్, రెండు గిన్నెల బీన్స్ సూప్ తాగా. కాసేపటికి కడుపులో ఏదో తేడాగా అనిపించింది. దీంతో.. అలా మంచంపై పడుకున్నా. కానీ.. కడుపులో గడబిడ మాత్రం అంతకంతకూ తీవ్రమైంది. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారింది. శ్వాస తీసుకున్న ప్రతిసారీ ఛాతిలో పెద్ద నొప్పి వచ్చింది. గుండెపోటు వచ్చిందనుకుని కంగారు పడిపోయా. వెంటనే నా ఫ్రెండ్స్‌కు ఫోన్ చేసి నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లమని చెప్పా.  ఆస్పత్రిలో వైద్యులకు నేను తీసుకునే ఆహారం గురించి చెప్పా! అయితే.. నా వృత్తి ఏంటనేది మాత్రం వారికి చెప్పలేదు. అయితే..  గుండెపోటు, స్ట్రోక్ వంటివి రాలేదని వైద్యులు చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నా. కడుపులో గ్యాస్ ఎక్కువవడంతోనే ఇలా జరిగిందని వారు తెలిపారు. తిండి మార్చాలని సూచించారు. దీంతో.. నా వ్యాపారానికి బ్రేక్ పడింది’’ అని ఆమె చెప్పుకొచ్చింది. 

Updated Date - 2022-01-07T01:29:48+05:30 IST