కూరగాయలు కొనేందుకు వెళ్లి తిరిగిరాని కోడలు.. చివరకు తెలిసిందేంటంటే?

ABN , First Publish Date - 2022-06-02T07:58:30+05:30 IST

కూరగాయలు కొనేందుకు మార్కెట్ వెళ్లిన ఒక మహిళ తిరిగి ఇంటికి రాలేదు. ఆ కుటుంబ సభ్యలు ఆందోళన చెంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మరుసటి రోజే ఆమె మృతదేహం ఊరి చివర దొరికింది. ఈ ఘటన నవీ ముంబైలోని పన్వేల్ ప్రాంతంలో...

కూరగాయలు కొనేందుకు వెళ్లి తిరిగిరాని కోడలు.. చివరకు తెలిసిందేంటంటే?

కూరగాయలు కొనేందుకు మార్కెట్ వెళ్లిన ఒక మహిళ తిరిగి ఇంటికి రాలేదు. ఆ కుటుంబ సభ్యలు ఆందోళన చెంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మరుసటి రోజే ఆమె మృతదేహం ఊరి చివర దొరికింది. ఈ ఘటన నవీ ముంబైలోని పన్వేల్ ప్రాంతంలో వెలుగు చూసింది. 


సదరు యువతి పేరు రేష్మ. ఆమె భర్త గతేడాది కరోనా కారణంగా మరణించాడు. ఇద్దరు పిల్లల తల్లి అయిన రేష్మకు ఆ తర్వాత జయంత్ సురేష్ అనే ఒక ఆటో డ్రైవర్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య ఎఫైర్ నడిచింది. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని రేష్మ అడిగినా.. సురేష్ నిరాకరించాడు. ఈ నేపథ్యంలోనే ఒకరోజు కూరగాయలు కొనేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆమె మళ్లీ తిరిగి రాలేదు. కాల్ చేస్తే ఒకసారి దార్లో ఉన్నానని చెప్పింది. ఆ తర్వాత కాసేపటికే మొబైల్ స్విచాఫ్ అని వచ్చింది. దాంతో అనుమానం వచ్చిన అత్తారింటి వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


రంగంలోకి దిగిన 24 గంటల్లోనే పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. యువతి పేరిటే సిమ్ కార్డు తీసుకున్న అతను.. అదే నెంబరుతో ఆమెతో మాట్లాడేవాడని చెప్పారు. సురేశ్ ఆ రోజు రేష్మని ఊరి చివర ఒక నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేశాడు.


ఆ నెంబరు ట్రాక్ చేస్తూ సురేష్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Updated Date - 2022-06-02T07:58:30+05:30 IST