పరువు పోతోందని పక్కా స్కెచ్.. భార్య నిద్రపోతుండగా అర్ధరాత్రి ఆ ఇంట్లో దారుణం.. తెల్లారేసరికల్లా కట్టుకథను అల్లారు కానీ..

ABN , First Publish Date - 2022-06-18T00:27:10+05:30 IST

ఎప్పటిలాగే ఆమె రాత్రి భోజనం చేసి తన గదికి వెళ్లి నిద్రపోయింది. ఆమె నిద్రలోకి జారుకున్న వెంటనే భర్త సహా కుటుంబ సభ్యులు దారుణానికి పాల్పడ్డారు. ముందుగా అనుకున్నట్టే పక్కా ప్లాన్ ప్రకారం అంతా పూర్తి చేశారు. అనంతరం ఓ మంచి కట్టుకథ అల్లా

పరువు పోతోందని పక్కా స్కెచ్.. భార్య నిద్రపోతుండగా అర్ధరాత్రి ఆ ఇంట్లో దారుణం.. తెల్లారేసరికల్లా కట్టుకథను అల్లారు కానీ..

ఇంటర్నెట్ డెస్క్: ఎప్పటిలాగే ఆమె రాత్రి భోజనం చేసి తన గదికి వెళ్లి నిద్రపోయింది. ఆమె నిద్రలోకి జారుకున్న వెంటనే భర్త సహా కుటుంబ సభ్యులు దారుణానికి పాల్పడ్డారు. ముందుగా అనుకున్నట్టే పక్కా ప్లాన్ ప్రకారం అంతా పూర్తి చేశారు. అనంతరం ఓ మంచి కట్టుకథ అల్లారు. అయితే పోలీసులు తమ స్టైల్‌లో విచారణ జరిపే సరికి తప్పు ఒప్పుకున్నారు. కాగా.. ఇంతకూ ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే..


జార్ఖండ్‌కు చెందిన కిరణ్ దేవి అనే మహిళకు దేవెన్ కర్మాకర్ అనే వ్యక్తితో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే ఎప్పటిలాగే రాత్రి భోజనం చేసిన ఆమె.. తన గదిలోకి వెళ్లి పడుకుంది. ఆమె నిద్ర పోతున్న విషయాన్ని భర్త దేవెన్ సహా అతడి కుటుంబ సభ్యులు గమనించి ముందుగా అనుకున్న ప్లాన్‌ను అమలు చేశారు. దిండుతో ఒకరు ఆమెకు శ్వాస ఆడకుండా చేయగా.. మిగిలిన కుటుంబ సభ్యులు కాళ్లు, చేతులు పట్టుకున్నారు. కిరణ్ దేవి చనిపోయిన తర్వాత మృతదేహాన్ని స్థానికంగా ఉన్న పాఠశాల వద్దకు తీసుకెళ్లి నిప్పటించారు. అనంతరం సగం కాలిన మృతదేహాన్ని తిరిగి ఇంటికి తీసుకొచ్చి, ఆమే కిరోసిన్ పోసి నిప్పంటించుకున్నట్టు క్రియేట్ చేశారు. కుటుంబ సభ్యుల అరుపులతో అక్కడకు చేరుకున్న స్థానికులు ఘనన గురించి పోలీసులకు సమాచారం అందించారు. 



దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రిపోర్టులో ఆమెది హత్యే అని నిర్ధారణ కావడంతో  కుటుంబ సభ్యులను పోలీసులు తమ స్టైల్‌లో విచారించారు. దీంతో నిజం ఒప్పేసుకున్నారు. కిరణ్ దేవికి ఓ వ్యక్తితో అక్రమ సంబంధం ఉందనీ.. ఆమె ప్రవర్తనతో తమ పరువుపోతోందని.. అందుకే హత్య చేసినట్టు వెల్లడించారు. ఈ క్రమంలో భర్త సహా ఆరుగురు కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి, జైలుకు తరలించారు. మరొకరు పరారీలో ఉన్నారని.. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు.  


Updated Date - 2022-06-18T00:27:10+05:30 IST