దాతలు.. ఆదుకోండి.. కిడ్నీ, కాలేయ సంబంధ వ్యాధితో మంచం పట్టిన మహిళ

ABN , First Publish Date - 2020-07-07T18:20:36+05:30 IST

ఉండటా నికి ఇళ్లు లేదు. రోజువారి కూలీ పనులు చేస్తేనే ఇంట్లో పూట గడుస్తోంది. అలాంటి కుటంబంలో భర్తకు కాలు విరిగి ఇంటివద్దనే ఉంటున్నాడు. కూలీ పనులు చేసి ఆ కుటుంబాన్ని సాకుతున్న మహిళ కిడ్నీ

దాతలు.. ఆదుకోండి.. కిడ్నీ, కాలేయ సంబంధ వ్యాధితో మంచం పట్టిన మహిళ

కరకగూడెం (ఖమ్మం జిల్లా): ఉండటా నికి ఇళ్లు లేదు. రోజువారి కూలీ పనులు చేస్తేనే ఇంట్లో పూట గడుస్తోంది. అలాంటి కుటంబంలో భర్తకు కాలు విరిగి ఇంటివద్దనే ఉంటున్నాడు. కూలీ పనులు చేసి ఆ కుటుంబాన్ని సాకుతున్న మహిళ కిడ్నీ, కాలేయం సంబం ధిత వ్యాధితో ఇబ్బంది పడుతోంది.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని తాటిగూడెం గ్రామానికి చెందిన గాందర్ల ఈశ్వరి (40)అనే మహిళ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఇటీవల ఏటూర్‌నాగారం వైద్యశాలకు కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. 


అక్కడ డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించి ఆమెకు కిడ్నీ, కాలేయం సంబంధిత వ్యాధులు  ఉన్నాయని చెప్పారు. వెంటనే ఆపరేషన్‌ చేయాలని, అందుకు సుమారు 4.లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. 12 సంవత్సరాల క్రితం భర్త నర్సయ్య ద్విచక్ర వాహన ప్రమాదంలో కాలు విరిగి ఇంటికే పరిమితం అయ్యడని, అప్పటి నుంచి ఈశ్వరి కూలి పనులు చేస్తూ కుటుంబ భారం మోస్తోందని  గ్రామస్థులు తెలిపారు. బాధితురాలు ఈశ్వరి ఆపరేషన్‌ కోసం ఆ కుటంబ సభ్యులు దాతల సాయాన్ని కోరుతున్నారు. సాయం చేయాలనుకునే వారు ఈశ్వరి ఫోన్‌ నెం 8374 841192 సంప్రదించాలని,  ఏపీజీవీబీ 73081006925, ఐఎ్‌ఫఎస్‌ ఏపీజీవీ0004193 నెంబర్‌కి ఆర్ధిక సహాయం పంపించగలరని బాధితులు కోరుతున్నారు.

Updated Date - 2020-07-07T18:20:36+05:30 IST