34ఏళ్ల టీచర్.. 8 నెలలుగా తన వద్దకు వచ్చె 14 సంవత్సరాల అబ్బాయిపై..

ABN , First Publish Date - 2021-11-04T22:08:00+05:30 IST

తమ పిల్లలు బాగా చదువుకుని ఉన్నత స్థితిలో ఉండాలని చాలా మంది తల్లిదండ్రులు కోరుకుంటారు. ఇందులో భాగంగానే తమ పిల్లలకు ప్రత్యేకంగా ట్యూషన్ చెప్పిస్తారు. ఈ కోవకే చెందిన తల్లిదండ్రులు.. తమ 14ఏళ్ల కుమారుడిని, కూతురిని ఓ ట్యూషన్ సెంటర్‌లో చేర్చించారు. దీంతో ట్యూషన్‌కు ఆ అన్నాచెల్లె

34ఏళ్ల టీచర్.. 8 నెలలుగా తన వద్దకు వచ్చె 14 సంవత్సరాల అబ్బాయిపై..

ఇంటర్నెట్ డెస్క్: తమ పిల్లలు బాగా చదువుకుని ఉన్నత స్థితిలో ఉండాలని చాలా మంది తల్లిదండ్రులు కోరుకుంటారు. ఇందులో భాగంగానే తమ పిల్లలకు ప్రత్యేకంగా ట్యూషన్ చెప్పిస్తారు. ఈ కోవకే చెందిన తల్లిదండ్రులు.. తమ 14ఏళ్ల కుమారుడిని, కూతురిని ఓ ట్యూషన్ సెంటర్‌లో చేర్చించారు. దీంతో ట్యూషన్‌కు ఆ అన్నాచెల్లెళ్లు ఇద్దరూ కలిసి వెళ్లారు. ఈ క్రమంలోనే ట్యూషన్ టీచర్.. ఓ రోజు అకస్మాత్తుగా 14ఏళ్ల అబ్బాయి సోదరిని ట్యూషన్ నుంచి ఇంటికి పంపించేసింది. దీంతో ఆ తల్లిదండ్రులు షాకయ్యారు. విషయం ఆరా తీశారు. ఆమె వల్ల మిగతా పిల్లలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పడంతో అబ్బాయిని అక్కడే కొనసాగించి.. అతడి సోదరిని మాత్రం వేరే ట్యూషన్ సెంటర్‌లో చేర్చించారు. ఈ క్రమంలోనే 8 నెలల తర్వాత ఆ 14ఏళ్ల కుర్రాడు కూడా టీచర్ దగ్గరకు ట్యూషన్‌కు వెళ్లని అని మారాం చేయడంతో తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. సమస్య ఏంటి అని అడిగారు. అనంతరం ఆ బాలుడు విషయం చెప్పడంతో షాకయ్యారు. కాగా.. విషయం ఏంటనే పూర్తి వివరాల్లోకి వెళితే.. 



చండీగఢ్‌కు చెందిన తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో స్థానికంగా ఉన్న ఓ ట్యూషన్ సెంటర్‌లో చేర్పించారు. చేర్పించిన కొద్ది రోజులకే ‘మీ పాప బాగా అల్లరి చేస్తోంది. మిగితా విద్యార్థులకు ఇబ్బందిగా ఉంది ఆమెను వేరే ట్యూషన్ సెంగటర్ పంపించండి’ అని చెప్పడంతో ఆ దంపతులు కంగుతిన్నారు. ఆ మరుసటి రోజు నుంచి తమ 14ఏళ్ల కుమారుడిని మాత్రమే ట్యూషన్‌కు పంపించారు. అయితే తాజాగా ఆ అబ్బాయి కూడా టీచర్ దగ్గరకు ట్యూషన్‌కు వెళ్లనని మారం చేయడం ప్రారంభించాడు. దీంతో అసలు సమస్య ఏంటని ఆ తల్లిదండ్రులు ఆరా తీశారు. ఈ క్రమంలో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. 


34ఏళ్ల టీచర్.. తమ 14 ఏళ్ల బాబుపై లైగింక దాడి చేస్తున్నట్లు తెలుసుకుని నివ్వెరపోయారు. బాబు అనుభవించిన బాధను ఊహించుకుని ఆవేదన చెందారు. ఈ విషయాన్ని తేలికగా తీసుకోకుండా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెను పోలీసులు అరెస్టు చేసి, జైలుకు తరలించారు. ఈ ఘటన 2018లో చోటు చేసుకోగా.. దీనిపై విచారణ జరిపిన కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. ఆ మహిళా ట్యూటర్‌కు కోర్టు 10ఏళ్ల జైలు శిక్షతోపాటు, 10వేల జరిమానా విధించింది. 




Updated Date - 2021-11-04T22:08:00+05:30 IST