Abn logo
Aug 22 2020 @ 11:52AM

లాడ్జి రహస్య గదిలో మహిళ బందీ..వ్యభిచారం గుట్టురట్టు

Kaakateeya

కోయంబత్తూర్ (తమిళనాడు): ఓ లాడ్జీలో అద్దాల మాటున రహస్య గదిలో మహిళను బంధించి గుట్టుగా వ్యభిచారం సాగిస్తున్న బాగోతం తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్ నగరంలో వెలుగుచూసింది.లాడ్జీలో వ్యభిచారం సాగుతుందనే సమాచారం మేర కోయంబత్తూర్ నగరం మెట్టుపాలయం సబ్ డివిజనులోని కల్లార్ సమీపంలోని శరణ్య లాడ్జిపై కోయంబత్తూర్  పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. పోలీసుల దాడిలో డ్రెస్సింగ్ అద్దం వెనుక ఓ రహస్య గదిని కనుగొన్నారు. రహస్య గదిలో సింగిల్ మంచం, ఒక పరుపు ఉంది. ఈ రహస్య గదిలో 22 ఏళ్ల ఓ మహిళను బందీగా ఉంచారు. ఈ మహిళ మూడు రోజుల క్రితమే బెంగళూరు నుంచి కోయంబత్తూరుకు వచ్చిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసులు మహిళను ప్రభుత్వ షెల్టరు హోంకు తరలించి లాడ్జీకి సీలు వేశారు. లాడ్జి యజమాని మహేంద్రన్, రూంబాయ్ గణేశన్ రూమ్ బాయ్‌లను అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. వీరిద్దరూ మూడేళ్లుగా లాడ్జీలోని రహస్య గదిలో వ్యభిచారం నడుపుతున్నారని  పోలీసులు పేర్కొన్నారు. కరోనా కారణంగా లాడ్జీని మూసివేసినా, రహస్య గదిలో గుట్టుగా వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని పోలీసులు చెప్పారు. 

Advertisement
Advertisement
Advertisement