Advertisement
Advertisement
Abn logo
Advertisement

డ్యూటీ నుంచి తిరిగి వచ్చి తలుపు కొడితే లోపలి నుంచి పిల్లల ఏడుపులు.. బలవంతంగా తలుపు తెరిచి చూస్తే..

మధ్యాహ్నం పని నుంచి ఇంటికి తిరిగి వచ్చిన వ్యక్తి తలుపు తట్టాడు.. భార్య ఎంతకీ తలుపు తెరవలేదు.. లోపలి నుంచి పిల్లల ఏడుపులు వినిపించాయి.. దీంతో ఆ వ్యక్తి చుట్టుపక్కల వారి సహాయంతో బలవంతంగా తలుపులు తెరిచాడు.. లోపలి దృశ్యాన్ని చూసి షాకైపోయాడు.. లోపల అతని భార్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.. పక్కన పిల్లలు ఏడుస్తూ కూర్చున్నారు.. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. 


మీరట్‌కు చెందిన ఆశారాం, సాధన (30) దంపతులు పదేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఓ స్వీట్ షాప్‌లో పనిచేసే ఆశారాంతో సాధన తరచుగా గొడవపడేది. ఏదో ఒక విషయం గురించి వీరు తరచుగా గొడవపడేవారు. గురువారం ఉదయం కూడా వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో సాధనపై ఆశారాం చేయి చేసుకున్నాడు. కొద్దిసేపటి అనంతరం ఇంటి నుంచి పనికి వెళ్లిపోయాడు. ఆగ్రహం చెందిన సాధన తన పిల్లల ఎదుటే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. 


మధ్యాహ్న భోజన సమయానికి ఆశారాం ఇంటికి తిరిగి వచ్చాడు. తలుపు కొట్టినా లోపలి నుంచి ఎలాంటి స్పందనా లేదు. కొద్ది సేపటికి లోపలి నుంచి పిల్లల ఏడుపులు వినిపించాయి. దీంతో చుట్టుపక్కల వారి సహాయంతో ఆశారాం బలవంతంగా తలుపులు తెరిచాడు. లోపల సాధన ఉరేసుకుని కనిపించింది. వెంటనే అతను పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు సాగిస్తున్నారు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement