Husband thrashed wife: భార్యను చెట్టుకు కట్టేసి చితక్కొట్టిన భర్త.. కారణమేంటంటే..

ABN , First Publish Date - 2022-08-01T01:02:56+05:30 IST

అనుమానం పెనుభూతం అంటారు.. చిన్న అనుమానం తీవ్ర అలజడులకు కారణమవుతుం

Husband thrashed wife: భార్యను చెట్టుకు కట్టేసి చితక్కొట్టిన భర్త.. కారణమేంటంటే..

అనుమానం పెనుభూతం అంటారు.. చిన్న అనుమానం తీవ్ర అలజడులకు కారణమవుతుంది.. భార్యాభర్తల మధ్య ఒకసారి అనుమానం మొదలైతే అది దావానలంలా వ్యాపిస్తుంది.. వాస్తవం తెలుసుకునేందుకు ప్రయత్నించకుండా తమ జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటారు.. రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకుని దారుణమైన అఘాయిత్యానికి పాల్పడ్డాడు.. ఆమెను చెట్టుకు కట్టేసి చితక్కొట్టాడు. 


ఇది కూడా చదవండి..

Shocking: డాక్టర్‌పై మర్డర్ కేసు.. ఆపరేషన్ థియేటర్‌లో అతను చేసిన పనికి అందరూ షాక్!


రాజస్థాన్‌ (Rajasthan) లోని బన్స్‌వారా జిల్లాకు చెందిన ఓ మహిళను ఆమె భర్త, అత్తింటి తరఫు వారు చెట్టుకు కట్టేసి విపరీతంగా కొట్టారు. దాదాపు ఏడు గంటల పాటు ఆమెను చెట్టుకు కట్టేసి కొట్టారు. అసలేం జరిగిందంటే.. ఆ మహిళ తన స్నేహితుడితో మాట్లాడుతుండగా భర్త చూశాడు. వెంటనే తీవ్ర ఆగ్రహానికి లోనై ఆమెను పక్కనే ఉన్న చెట్టుకు కట్టేశాడు. తీవ్రంగా హింసించాడు. దెబ్బలకు తాళలేక ఆ మహిళ కేకలు పెట్టింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. 


ఈ వీడియో జాతీయ మహిళా కమిషన్ (National Commission for Women) దృష్టికి వెళ్లింది. వెంటనే స్పందించిన ఎన్‌సీడబ్ల్యూ.. రాజస్థాన్ రాష్ట్ర డీజీపీకి లేఖ రాసింది. రంగంలోకి దిగిన పోలీసులు బాధితురాలి భర్త, బావతో సహా నలుగురిని అరెస్టు చేశారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరు మైనర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2022-08-01T01:02:56+05:30 IST