యువకుడిని వ్యాలెంటైన్స్ డే రోజు పిలిచిన ప్రేయసి.. అతను చేసిన పని వల్ల ఎంత ఘోరం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-02-16T06:23:52+05:30 IST

వ్యాలెంటైన్స్ డే అనగా ప్రేమికుల దినోత్స‌వం. ఈ ప్రత్యేకమైన రోజున ప్రేమికలు ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో ఒక పండుగలా జరుపుకుంటారు. గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో కూడా వ్యాలెంటైన్స్ డేని ప్రేమికులు ప్రత్యేక దినంగా జరుపుకుంటున్నారు. ఆ రోజు ఎలా గ‌డ‌పాల‌ని ర‌క‌ర‌కాలుగా ఆలోచిస్తుంటారు. అందుకు త‌గ్గ ప్ర‌ణాళిక వేసుకుంటూ ఉంటారు. కానీ ఈ స్పెషల్ రోజు తన ప్రియుడితో సంతోషంగా గడపాలన్న ఒక యువతికి విషాదంగా ముగిసింది...

యువకుడిని వ్యాలెంటైన్స్ డే రోజు పిలిచిన ప్రేయసి.. అతను చేసిన పని వల్ల ఎంత ఘోరం జరిగిందంటే..

వ్యాలెంటైన్స్ డే అనగా ప్రేమికుల దినోత్స‌వం. ఈ ప్రత్యేకమైన రోజున ప్రేమికలు ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో ఒక పండుగలా జరుపుకుంటారు. గత కొన్ని సంవత్సరాలుగా  భారతదేశంలో కూడా వ్యాలెంటైన్స్ డేని ప్రేమికులు ప్రత్యేక దినంగా జరుపుకుంటున్నారు. ఆ రోజు ఎలా గ‌డ‌పాల‌ని ర‌క‌ర‌కాలుగా ఆలోచిస్తుంటారు. అందుకు త‌గ్గ ప్ర‌ణాళిక వేసుకుంటూ ఉంటారు. కానీ ఈ స్పెషల్ రోజు తన ప్రియుడితో సంతోషంగా గడపాలన్న ఒక యువతికి విషాదంగా ముగిసింది. ఈ ప్రత్యేకమైన రోజున తనకిష్టమైన వ్యక్తితో గడపాలని ఎంతో ఆశతో ఎదురుచూసిన ఆ యువతి కల.. కలగానే మిగిలిపోయింది. కోరుకున్న చెలికాడు తన కోసం రాలేదనే బాధతో ఆమె తన ప్రాణాలనే త్యజించింది.


వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని భిలాయి నగరానికి చెందిన దీక్ష సముద్ర(20) అనే యువతి పిజిడిసీఏ కంప్యూటర్ కోర్సు చదువుకుంటూ ఒక హాస్టల్‌లో ఉంటోంది. చదువుకునే క్రమంలో ఆమెకు ఒక యువకుడు పరిచయమయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారింది. దీక్ష ఆ యువకుడిని గాఢంగా ప్రేమించింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 14న వ్యాలెంటైన్స్ డే సందర్భంగా అతనితో సంతోషంగా సమయం గడపాలని ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ విషయం తన ప్రియుడికి చెప్పి ప్రేమికుల రోజు ఎంతో స్పెషల్‌గా జరుపుకుందామని ప్లానింగ్ చేసింది. కానీ ఆమె ఆశలు.. అడియాశలయ్యాయి. 


వ్యాలెంటైన్స్ డే రోజున దీక్ష తన ప్రియుడి రాక కోసం ఎదురుచూస్తూ ఉండగా.. అతను ఎంతసేపటికీ రాలేదు. దీంతో దీక్ష పలుమార్లు అతనికి ఫోన్ కూడా చేసింది. కానీ అతను దీక్ష ఫోన్ రిసీవ్ చేసుకోలేదు. తన ప్రియుడి ప్రవర్తనతో భంగపడిన దీక్ష.. ఈ విషయం తన స్నేహితురాలికి ఫోన్ చేసి చెప్పింది. తన ప్రియుడు తనను బహుశా ప్రేమించడం లేదని చెప్పి ఏడ్చింది. ఆ తరువాత ఇక తను ఎవరి కోసం బతకాలని చెబుతూ ఫోన్ కట్ చేసింది. దీక్ష మాటలతో ఆందోళన చెందిన ఆమె స్నేహితురాలు వెంటనే తిరిగి ఫోన్ చేసినా.. దీక్ష ఫోన్ ఎత్తడంలేదు. ఆవేశంలో దీక్ష ఏం చేసుకుంటుందోనని.. ఆమె స్నేహితురాలు అత్యవసరంగా హాస్టల్‌లోని దీక్ష గదికి చేరుకుంది. అక్కడ అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. దీక్ష ఉరి వేసుకొని చనిపోయింది.


Updated Date - 2022-02-16T06:23:52+05:30 IST