Advertisement
Advertisement
Abn logo
Advertisement

మహిళ ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్/రాజేంద్రనగర్‌: ఒంటరి తనంతో మనస్తాపానికి గురైన ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గండిపేట్‌ మండలం బండ్లగూడ ఖాళీమందిర్‌ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాల వద్ద కవిత(40)అనే మహిళ అద్దె ఇంట్లో నివాసముంటోంది. స్థానికంగా పనిచేసుకుంటూ జీవనం గడుపుతోంది. ఆమెకు నా అనేవారు లేరు. అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. మనస్తాపానికి గురైన ఆమె మంగళవారం బండ్లగూడ ఖాళీమందిర్‌ నుంచి సన్‌సిటీలోని నిర్మాణుష్య ప్రాంతంలో ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. ఖాళీన గాయాలతో ఉన్న మహిళను చూసిన స్థానికులు విషయాన్ని సన్‌సిటీ వద్ద పెట్రోలింగ్‌ నిర్వహించే బీట్‌ కానిస్టేబుల్‌కు చెప్పారు. ఆయన స్థానిక ఎస్‌ఐ బాల్‌రాజ్‌కు సమాచారమిచ్చాడు. బాల్‌రాజ్‌ రాజేంద్రనగర్‌ ఏసీపీ బి.గంగాధర్‌కు చెప్పగా.. ఘటనా స్థలానికి వెళ్లి కాలిన గాయాలతో ఉన్న కవితను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement