ఉపాధి కోసం అబుధాబికి భారత మహిళ.. రెండేళ్ల తర్వాత స్వదేశానికి తిరిగొచ్చిన ఆమెను చూసి కుటుంబ సభ్యులు షాక్!

ABN , First Publish Date - 2021-07-28T17:31:28+05:30 IST

ఉపాధి కోసం అబుధాబి వెళ్లిన కేరళకు చెందిన మహిళ.. రెండేళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చింది. ఆ సమయంలో ఆమెను చూసిన కుటుంబ సభ్యులు నిర్ఘాంతపోయారు.

ఉపాధి కోసం అబుధాబికి భారత మహిళ.. రెండేళ్ల తర్వాత స్వదేశానికి తిరిగొచ్చిన ఆమెను చూసి కుటుంబ సభ్యులు షాక్!

పిరవొమ్, కేరళ: ఉపాధి కోసం అబుధాబి వెళ్లిన కేరళకు చెందిన మహిళ.. రెండేళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చింది. ఆ సమయంలో ఆమెను చూసిన కుటుంబ సభ్యులు నిర్ఘాంతపోయారు. పనిచేసే చోట యమజాని వేధింపులతో ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. రోజుల తరబడి సరిగ్గా భోజనం పెట్టకపోవడం, శారీరకంగా హింసించడంతో ఆమె పూర్తిగా బక్క చిక్కియింది. ఆమె శరీరం, తలపై కొట్టిన గాయాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆమె పిరవొమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి కుటుంబ సభ్యులు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు.


పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కేరళ రాష్ట్రం ఎడకడ్‌కు చెందిన లిజ్జీ(55) అనే మహిళ స్థానికంగా అంగన్‌వాడీ కార్యకర్తగా పనిచేసేది. అయితే, కుటుంబ ఆర్థిక అవసరాల కోసం రెండేళ్ల కింద ఓ ఇంట్లో పనిచేసేందుకు రెండేళ్ల కాంట్రాక్టుపై అబుధాబి వెళ్లింది. దీనికిగాను లిజ్జీకి నెలకు రూ.20వేలు ఇస్తామని యజమాని ఒప్పందం చేసుకున్నాడు. మొదటి ఏడాది బాగానే చూసుకున్న యజమాని ఆ తర్వాత ఆమెకు నరకం చూపించాడు. ప్రతిరోజు కొట్టడం, సరిగ్గా భోజనం పెట్టకపోవడం, విరామం లేకుండా ఎక్కువ సమయం పని చేయించారు. దీంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. ఏడాది పాటు లిజ్జీని తన కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడనీయలేదు. అలాగే ఆమెకు ఆ ఏడాది మొత్తం ఎలాంటి జీతం ఇవ్వలేదు. తీవ్ర అనారోగ్యం బారినపడ్డ లిజ్జీ ఇక పనిచేయలేదని భావించిన యజమాని తిరిగి స్వదేశానికి పంపించాడు. 


దాంతో ఆ నరకకూపం నుంచి లిజ్జీకి విముక్తి దొరికినట్లైంది. ఇక ఇంటికి తిరిగొచ్చిన లిజ్జీని చూసి ఆమె కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. మొదట వారికి అసలేమీ అర్థం కాలేదు. ఒంటినిండా గాయాలతో బక్కాచిక్కిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఆమెను చూసి వారు నిర్ఘాంతపోయారు. దాంతో అసలేం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. ఇక పనిచేసే చోట తనపై యజమాని చేసిన అకృత్యాలను కుటుంబ సభ్యులకు చెప్పింది లిజ్జీ. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు చికిత్స కోసం పిరవొమ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి కొలెంచెర్రీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ విషయమై కుటుంబ సభ్యులు పిరవొమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని పూర్తి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు.     

Updated Date - 2021-07-28T17:31:28+05:30 IST