Advertisement
Advertisement
Abn logo
Advertisement

మహిళా SI కు కూడా తప్పని లైంగిక వేధింపులు.. పోలీస్ స్టేషన్‌లోనే అత్యాచారయత్నం.. భర్తకు చెప్తే..

మహిళ.. పోలీస్ అధికారి అయినా కూడా ఆమెకు లైంగిక వేధింపులు తప్పవని తాజా సంఘటన రుజువు చేస్తోంది. ఓ మహిళా ఎస్సైపై ఆమె సబార్డినేట్ అత్యాచార యత్నం చేయడం సంచలనంగా మారింది. అత్యాచార యత్నం మాత్రమే కాకుండా కులం పేరుతో కూడా దూషించాడు. దీంతో ఆమె ఎస్పీని ఆశ్రయించింది. ఈ ఘటనపై దర్యాఫ్తునకు ఆదేశించిన ఎస్పీ లైంగిక వేధింపులకు పాల్పడిన ఉద్యోగిని సస్పెండ్ చేశారు. హర్యానాలో రోహ్‌తక్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 


ఇవి కూడా చదవండి

ATM లోంచి రూ.15 వేలు తీయబోయిన మహిళకు షాక్.. రిసిప్ట్ వచ్చింది కానీ.. డబ్బులు రాలేదు.. చివరకు..
బ్యాంకు ఖాతాలో రూ.5.5 లక్షలు జమ అయినట్టు మెసేజ్.. మోదీ వేశారనుకుని ఖర్చు పెట్టేసిన తర్వాత..

హర్యానాలోని సోనిపట్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వరిస్తున్న మహిళపై ఏఎస్సై సతీష్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఓ కేసు విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో అతను ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఆమె ఒంటరిగా గదిలో ఉన్నప్పుడు వెళ్లి ఆమె చెయ్యి పట్టుకున్నాడు. తర్వాతి రోజు పోలీస్ స్టేషన్‌లో ఆమెపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. దళిత కులానికి చెందిన ఆమెను కులం పేరుతో దూషించాడు. 


దీంతో ఆమె గత సోమవారం జిల్లా ఎస్పీని సంప్రదించి సతీష్‌పై ఫిర్యాదు చేసింది. తనపై అత్యాచార యత్నానికి పాల్పడడమే కాకుండా కులం పేరుతో దూషణలకు దిగాడని తెలిపింది. ఈ ఘటనపై ఎస్పీ సమగ్ర విచారణకు ఆదేశించారు. విచారణ పూర్తయ్యే వరకు సతీష్‌ను విధుల నుంచి తప్పించారు.   

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement